Salman khan: సల్మాన్‌ ఖాన్‌ని అడ్డుకోవడంలో తప్పులేదు..! అతడు తన బాధ్యతను మాత్రమే నిర్వహించాడు..

Salman khan: ఇటీవల ముంబై విమానాశ్రయంలో బాలీవుడ్‌ అగ్ర నటుడు సల్మాన్‌ ఖాన్‌కి వింత అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.

Salman khan: సల్మాన్‌ ఖాన్‌ని అడ్డుకోవడంలో తప్పులేదు..! అతడు తన బాధ్యతను మాత్రమే నిర్వహించాడు..
Salman Khan

Updated on: Aug 25, 2021 | 11:36 AM

Salman khan: ఇటీవల ముంబై విమానాశ్రయంలో బాలీవుడ్‌ అగ్ర నటుడు సల్మాన్‌ ఖాన్‌కి వింత అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. సెక్యూరిటీ చెక్‌ను పట్టించుకోకుండా వెళ్తున్న సల్మాన్ ఖాన్‌ని సీఐఎస్‌ఫ్‌ యువ అధికారి అడ్డుకొని సెక్యూరిటీ చెక్‌ని పూర్తి చేయాల్సిందిగా కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌, మరికొంతమంది సీఐఎస్‌ఫ్‌ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీఐఎస్‌ఫ్‌.. తమ అధికారి తన బాధ్యతను నిర్వర్తించారని, విధి నిర్వహణలో ఆదర్శప్రాయుడని ట్వీట్ చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘టైగర్ 3’ సినిమా షూటింగ్ కోసం రష్యా వెళ్లేందుకు సల్మాన్ ఖాన్ ముంబై విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించడానికి ముందు తప్పనిసరిగా సెక్యూరిటీ చెక్ చేయించుకోవాల్సి ఉండగా, సల్మాన్ అదేమీ పట్టనట్టు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్పుడు సల్మాన్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఎంట్రన్స్ వద్ద ఉన్న ఉన్న యువ సీఐఎస్ఎఫ్ అధికారి సల్మాన్‌ను లోపలికి వెళ్లకుండా అడ్డుకుని.. తొలుత సెక్యూరిటీ చెక్ పూర్తిచేయాలని కోరారు. అదే సమయంలో సల్మాన్ ఫొటోలను తీస్తున్న ఫొటోగ్రాఫర్లను వెనక్కి వెళ్లాల్సిందిగా కోరడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వినిపిస్తోంది. సెలిబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్ బయానీ ఈ వీడయోను పోస్టు చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది.

MLA Ramulu Naik: “తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియాగాంధీకి థ్యాంక్స్”.. వైరల్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్

KT Raghavan Video: పార్టీ సభ్యురాలితో అసభ్యకర చాటింగ్.. తమిళనాట బీజేపీ నేత వీడియో కాల్ దుమారం

కరోనా థర్డ్‌ వేవ్ టార్గెట్ పిల్లలేనా…? థర్డ్‌ వేవ్ పై మరో స్టడీ.. ప్రధానికి కీలక రిపోర్ట్..: Third Wave Video.