Abhishek Bachchan: బాలీవుడ్ హీరో.. బిగ్ బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ గాయపడ్డారు. ప్రస్తుతం అభిషేక్ నటిస్తున్న ‘బాబ్ విశ్వాస్’ సినిమాలో నటిస్తున్న షూటింగ్ సందర్భంగా సెట్ లో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల అభిషేక్ బచ్చన్ హాస్పిటల్‌లో చేరిన సమయంలో చేతికి బ్యాండేజ్‌తో కూడిన ఫోటోలు బయటకు వచ్చాయి. భుజానికి చేతికి పట్టి వేసుకొని అభిషేక్ ఆ ఫోటోల్లో కనిపించారు. దీంతో అభిషేక్ చేతికి గాయమైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయపడిన అభిషేక్ బచ్చన్ చికిత్స నిమిత్తంలీలావతి ఆసుపత్రిలో చేరారు. దీంతో తనయుడిని చూడడనికి అమితాబ్ బచ్చన్ తన కుమార్తె శ్వేతా బచ్చన్ తో కలిసి ఆదివారం లీలావతి ఆసుపత్రిని సందర్శించినట్లు బీ టౌన్ టాక్.
అభిషేక్ గాయంపై లీలావతి సీఈఓ స్పందించారు. అభిషేక్ గాయపడ్డారని.. అయితే చిన్న గాయమని చెప్పారు. చికిత్స అనంతరం అభిషేక్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లిపోయాడని చెప్పారు. కొని రోజుల క్రితం తన కూతురు కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య మణిరత్నం చిత్రం పొన్నియిన్ సెల్వన్ చిత్రీకరణ కోసం మధ్యప్రదేశ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ తీవ్రంగా గాయపడ్డారని వార్తలతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
Also Read: జూకు వెళ్లి చింపాజీతో ప్రేమలో పడిన ఓ మహిళ.. ఆ మహిళను బ్యాన్ చేసిన అధికారులు.. ఎక్కడంటే
పిల్లల తల్లైనా స్టార్ హీరోయిన్‌గా ఖ్యాతిగాంచిన అలనాటి మేటి నటి అంజలీదేవి జయంతి నేడు