Tollywood: కాలేజీలో అవార్డ్ ఇవ్వడానికి వెళ్లి విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నటుడు.. చెదరని నిజమైన ప్రేమకథ..

బాలీవుడ్‌లోని ప్రముఖ నటుల్లో అర్షద్ వార్సీ ఒకరు. మున్నా భాయ్ MBBS చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి పాపులర్ అయ్యాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ స్థాయిలో నిలబడ్డాడు అర్షద్. అతడు డౌన్ టూ ఎర్త్ పర్సన్. అర్షద్.. 14 ఫిబ్రవరి 1999న ప్రేమికుల రోజున మరియా గోరెట్టిని వివాహం చేసుకున్నాడు.

Tollywood: కాలేజీలో అవార్డ్ ఇవ్వడానికి వెళ్లి విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నటుడు.. చెదరని నిజమైన ప్రేమకథ..
Actor
Follow us

|

Updated on: Apr 23, 2024 | 10:04 PM

బాలీవుడ్‌లోని ప్రముఖ నటుల్లో అర్షద్ వార్సీ ఒకరు. మున్నా భాయ్ MBBS చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి పాపులర్ అయ్యాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ స్థాయిలో నిలబడ్డాడు అర్షద్. అతడు డౌన్ టూ ఎర్త్ పర్సన్. అర్షద్.. 14 ఫిబ్రవరి 1999న ప్రేమికుల రోజున మరియా గోరెట్టిని వివాహం చేసుకున్నాడు. అర్షద్ పెళ్లి జరిగి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ వీరి ప్రేమ చెక్కు చెదరలేదు. వీరిద్దరి లవ్ స్టోరీ సినిమాకు తీసిపోదు. ప్రేమకు హద్దులు ఉండవు అనే మాట ఈ సెలబ్రిటీ జంటకు సరిగ్గా సరిపోతుంది. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అర్షద్ పెద్దగా చదువుకోలేకపోయాడు. కాస్మెటిక్ సేల్స్‌మ్యాన్‌గా తన వృత్తిని ప్రారంభించి.. ఆ తర్వాత డాన్స్ నేర్చుకున్నాడు. అలా నెమ్మదిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నటుడిగా మారాడు.

1991లో సెయింట్ జేవియర్స్ కాలేజీలో జరిగిన డ్యాన్స్ టాలెంట్ షోకి న్యాయనిర్ణేతగా వెళ్లాడు. అదే సమయంలో మొదటిసారిగా హోస్టింగ్ చేసిన ఆ కాలేజ్ స్టూడెంట్ మరియాను చూశాడు. తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాడు.. ఆ టాలెంట్ షోలో మరియా విజేతగా నిలవడంతో ఆమె టాలెంట్ చూసి ముగ్దుడయ్యాడు. అర్షద్ తన డ్యాన్స్ గ్రూప్‌లో చేరమని మరియాకు ఆఫర్ చేశాడు కానీ ఆమె రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత మూడు నలెలకు అనుకోకుండా ఇద్దరు కలుసుకున్నారు. అప్పుడు మరోసారి డాన్స్ గ్రూపులో చెరమని అడగ్గా.. మరియా ఒప్పుకుంది. ఆ తర్వాత వారి పరిచయం స్నేహంగా మారింది. స్నేహం ప్రేమగా మారిన ఒకరినొకరు ఎప్పుడూ తమ ప్రేమను బయటపెట్టలేదు. అయితే ఒకసారి వీరిద్దరి దుబాయ్ వెళ్లగా అక్కడ డ్రింక్ లో బీరు కలిపి మరియాకు ఇచ్చానని.. ఆ మత్తులో తనలోని ప్రేమను ఆమె బయటపెట్టిందని అర్షద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

8 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట పెళ్లి చేసుకున్నారు. అర్షద్ ముస్లీం, మరియా క్రిస్టియన్ కావడంతో ఇద్దరు తమ తమ సంప్రదాయాలలో రెండు సార్లు వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 14, 1999న వివాహం చేసుకున్నారు. ఈ సంవత్సరం 2024లో, అర్షద్ వార్సీ, మరియా గోరెట్టి 25 సంవత్సరాల వివాహం తర్వాత తమ వివాహాన్ని కోర్టులో నమోదు చేసుకున్నారు.

View this post on Instagram

A post shared by Arshad Warsi (@arshad_warsi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..