Kangana Ranaut: కంగనాకు ఏమైంది? ముంబైలోని కోట్ల విలువైన విల్లాను అమ్మేసింది.. కారణమదేనా?

|

Sep 10, 2024 | 1:22 PM

కంగనా నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ. 1975 లో దేశంలో విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులను ఆధారంగా చేసుకుని స్వయంగా కంగనానే ఈ సినిమాను తెరకెక్కించింది. అంతేకాదు ఇందులో ఆమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.

Kangana Ranaut: కంగనాకు ఏమైంది? ముంబైలోని కోట్ల విలువైన విల్లాను అమ్మేసింది.. కారణమదేనా?
Actress Kangana Ranaut
Follow us on

కంగనా రనౌత్ ఇప్పుడు నటిగానే కాకుండా ఎంపీ కూడా. దీంతో సినిమా లైఫ్ ను, పొలిటికల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే కంగనా నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ. 1975 లో దేశంలో విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులను ఆధారంగా చేసుకుని స్వయంగా కంగనానే ఈ సినిమాను తెరకెక్కించింది. అంతేకాదు ఇందులో ఆమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. దీంతో కంగనా సినిమా వాయిదా పడక తప్పలేదు. అయితే తాజాగా ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా చెప్పలేదు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ముంబైలోని బాంద్రాలోని తన లగ్జరీ బంగ్లాను రూ.32 కోట్లకు విక్రయించింది కంగనా . ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో కంగనాకు రూ.32 కోట్ల ఇల్లు ఉంది. 2017లో 20 కోట్లకు ఈ ఇంటిని కొనుగోలు చేసింది కంగనా. ఈ భవనం దాదాపు 3,075 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 565 చదరపు అడుగుల పార్కింగ్ స్థలం కూడా ఉంది. ఇప్పుడు ఈ భవనాన్ని తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యక్తి కొనుగోలు చేశారు. ఇందుకోసంరూ.1.92 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. అయితే ఇప్పటివరకు దీనిపై కంగనా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.

కాగా కంగనాక సంబంధించిన ఈ ఇంటి స్థలం మొదటి నుండి వివాదంలో ఉంది. ఈ భవనంలో కొంత భాగాన్ని బృహత్ మున్సిపల్ కార్పొరేషన్ 2020లో కూల్చివేసింది. అక్రమంగా నిర్మిస్తున్నారనే ఆరోపణలతో ఈ భవనంలో కొంత భాగం ధ్వంసం చేశారు. అయితే దీని వెనుక రాజకీయాలు ఉన్నాయని అప్పట్లో కంగనా సంచన ఆరోపణలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఎమర్జెన్సీ సినిమాలో కంగనా..

 

కాగా కంగనా రనౌత్ నటించి తెరకెక్కించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాపై సిక్కుల సంఘం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. వేర్పాటువాదులను టెర్రరిస్టులుగా చూపించే అవకాశం ఉన్నందున చాలా మంది సిక్కు వర్గానికి చెందినవారు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణంగానే ఈ సినిమా వాయిదా పడింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.