Aishwarya Rai: అభిషేక్- ఐష్ విడాకుల వ్యవహారం.. సంచలన పోస్ట్ పెట్టిన నటి.. నెటిజన్ల దెబ్బకు..

|

Nov 07, 2024 | 11:53 AM

బాలీవుడ్ స్టార్ కపుల్అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఐష్, అభిషేక్ ల వ్యవహారంలోకి ఒక ప్రముఖ నటి జోక్యం చేసుకుంది. దీంతో ఆమెను నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు.

Aishwarya Rai: అభిషేక్- ఐష్ విడాకుల వ్యవహారం.. సంచలన పోస్ట్ పెట్టిన నటి.. నెటిజన్ల దెబ్బకు..
Aishwarya Rai Family
Follow us on

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడిపోతున్నారన్న వార్తలు బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనూ తీవ్ర   చర్చనీయాంశమవుతున్నాయి. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనేదానికి ఇప్పటివరకు సమాధానం లేదు. అయితే అభిషేక్ మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని, దీంతో ఐష్ కాపురంలో కలహాలు పెరిగాయని గుస గుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయంలో చాలా మంది అభిషేక్ ను తప్పు పడుతున్నారు. అయితే తొలిసారిగా అభిషేక్ తరపున బాలీవుడ్ నటి సిమి గరేవాల్ మాట్లాడింది. దీంతో ఆమెపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. అభిషేక్, ఐశ్వర్య విడిపోవడానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ నెల మొదట్లో ఐశ్వర్య పుట్టినరోజు జరుపుకుంది. అభిషేక్ నుంచి అతని ఫ్యామిలీ నుంచి కానీ కనీసం విషెస్ కూడా రాలేదు. దీంతో ఐష్- అభిషేక్ ల మధ్య నిజంగాన మనస్పర్థలు తలెత్తాయన్న వార్తకు మరింత బలం చేకూరుతోంది. ఇక బయటి కార్యక్రమలకు కూడా బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్య కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అభిషేక్ తరపున సిమీ మాట్లాడింది. ‘అభిషేక్‌ గురించి వ్యక్తిగతంగా తెలిసిన ప్రతి ఒక్కరూ అతను బాలీవుడ్‌లోని మంచి వ్యక్తులలో ఒకడని అంగీకరిస్తారు. నేను కూడా అభిషేక్ చాలా మంచి వ్యక్తి అని నేను భావిస్తున్నాను. అతనికి మంచి, విలువలు, మర్యాద గురించి బాగా తెలుసు’ అని సిమి పోస్ట్ పెట్టింది. దీంతో కొద్ది క్షణాల్లోనే సిమీ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు సిమీ గరేవాల్ పై మండి పండుతున్నారు. ‘ఇది వివాదాస్పద ప్రకటన. మీరు ఇలా పోస్ట్ చేయడం సరికాదు.’ అంటూ నెటిజన్లు సిమిని ట్రోల్ చేశారు. దీంతో ఆమె వెంటనే ఈ పోస్ట్‌ను తొలగించింది. అభిషేక్, ఐశ్వర్యల వివాహమై 17 ఏళ్లు అవుతోంది. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఐష్- అభిషేక్ దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అంబానీ ఫ్యామిలీ పెళ్లికి ఐశ్వర్య, అభిషేక్ విడివిడిగా వచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య తన తల్లితో కలిసి జీవిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు.

 

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.