Bigg Boss 10 Telugu: ఓటింగ్‌లో దుమ్మురేపిన ముకేష్, రోహిత్.. పాతాళానికి త్రిగుణ్.. ఈసారి లగేజీ సర్దేది ఎవరంటే..

బిగ్ బాస్ సీజన్ 10 రెండో వారం కూడా రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేటర్ అయ్యారు. చరణ్, చైత్ర హౌస్ నుంచి బయటకు రాగా.. ఇప్పుడు రెండో వారంలో 11 మంది నామినేషన్స్ లో ఉన్నారు. అయితే అటు ఓటింగ్ లో మాత్రం దుమ్మురేపుతున్నారు ముకేష్, రోహిత్. ఇక ఎప్పుడూ తన నోటి దూలతో అటు కంటెస్టెంట్లకు, ఇటు జనాలకు విసుగుపుట్టిస్తున్న త్రిగుణ్ రోజు రోజుకు గ్రాఫ్ తగ్గించుకుంటున్నాడు.

Bigg Boss 10 Telugu: ఓటింగ్‌లో దుమ్మురేపిన ముకేష్, రోహిత్.. పాతాళానికి త్రిగుణ్.. ఈసారి లగేజీ సర్దేది ఎవరంటే..
Bigg Boss 10 Telugu Voting

Updated on: Sep 17, 2026 | 1:27 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారానికి చేరుకోవడంతో హౌస్‌లో గొడవలు, మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరాయి. మొదటి వారంలో చరణ్, చైత్ర రాయ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లగా, ఈ రెండో వారం నామినేషన్లలో ఏకంగా 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. రోహిత్, ముకేష్ గౌడ, రాం ప్రసాద్, త్రిగుణ్, దేబ్జానీ, కృష్ణుడు, వర్షిణి, షాలిని, సృష్టి, ఝాన్సీ, సుధీర్ నామినేట్ అవ్వడంతో ఆడియన్స్ ఓటింగ్ అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే, బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంట్రీ ఇచ్చి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రోహిత్ నాయుడు దాదాపు 30 శాతం ఓటింగ్‌తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, అతనికి ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ ముకేష్ గౌడ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ముకేష్ సైలెంట్‌గా, కూల్‌గా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్, సీరియల్ ఫ్యాన్స్ ఓట్లతో 29 శాతం ఓటింగ్‌తో రోహిత్‌కు చేరువగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక జబర్దస్త్ క్రేజ్‌తో అడుగుపెట్టిన రాం ప్రసాద్ 8 శాతం ఓట్లతో మూడో స్థానంలో సేఫ్‌గా ఉన్నాడు.

బొక్కబోర్లా పడ్డ త్రిగుణ్!

మొదటి నుంచి నస క్యాండిడెట్ ఎవరైనా ఉన్నారంటే త్రిగుణ్ అని చెప్పాలి. మొదటి రోజు నుంచి రోహిత్ ను టార్గెట్ చేస్తూ తన నోటికి పని చెప్తున్న సంగతి తెలిసిందే. చిటికి మాటికి హౌస్‌లో రోహిత్‌తో గొడవలు పడుతూ, “నాకే ఎక్కువ ఓట్లు పడతాయి, నాతో గొడవపడితేనే స్క్రీన్ టైమ్ వస్తుంది” అని కామెంట్స్ చేసిన త్రిగుణ్‌కి ఆడియన్స్ గట్టి షాకే ఇచ్చారు. భారీ ఆశలు పెట్టుకున్న త్రిగుణ్‌కి కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే రావడంతో నాలుగో స్థానానికి పడిపోయాడు. అతని అనవసరపు మాటలు, సెల్ఫ్ డబ్బా ఆడియన్స్‌కు నచ్చకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ తర్వాతి స్థానాల్లో దేబ్జానీ (6%), షాలిని (5%) కొనసాగుతున్నారు.

డేంజర్ జోన్‌లో ఆ నలుగురు

మిగిలిన కంటెస్టెంట్స్ సుధీర్, ఝాన్సీ, వర్షిణి, సృష్టి , కృష్ణుడు సింగిల్ డిజిట్ ఓటింగ్‌కే పరిమితమయ్యారు. ముఖ్యంగా కృష్ణుడు, సృష్టి, వర్షిణిలకు 1 నుండి 2 శాతం మాత్రమే ఓట్లు నమోదు కావడంతో వీరిపై ఎలిమినేషన్ తలక్రిందులయ్యే అవకాశం ఉంది. వీరిలో కృష్ణుడు లీస్ట్ ఓటింగ్‌తో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. మొదటి వారంలో వాయిస్ వినిపించినప్పటికీ, వీకెండ్ ఎపిసోడ్ తర్వాత కృష్ణుడు గేమ్‌లో పూర్తిగా సైలెంట్ అయిపోయి, టాస్క్‌లలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో ఈ వారం కృష్ణుడు లేదా సృష్టి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us