Alludu Adhurs : అదరగొడుతున్న ‘అల్లుడు అదుర్స్’.. బ్రేక్ ఈవెన్ సాదించిందన్న బెల్లంకొండ సురేష్

బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సినిమా అల్లుడు అదుర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది...

Alludu Adhurs : అదరగొడుతున్న అల్లుడు అదుర్స్.. బ్రేక్ ఈవెన్ సాదించిందన్న బెల్లంకొండ సురేష్

Updated on: Jan 17, 2021 | 3:51 PM

Alludu Adhurs : బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘అల్లుడు అదుర్స్’. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ‘కందిరీగ’ ఫెమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభనటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తొలి వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ సాధించిందని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు.

ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ..పండగ సీజన్స్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లకు మంచి కలెక్షలు వస్తాయి. ‘అల్లుడు అదుర్స్’ కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుందని అన్నారు. `శాటిలైట్ హక్కులు సహా మొత్తం డిజిటల్ హక్కులు 21 కోట్లకు అమ్ముడయ్యాయి. సినిమా బడ్జెట్ సుమారు 32 కోట్లు అయ్యింది. మొదటి మూడు రోజుల్లోనే దాదాపు 10 కోట్ల వసూల్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికే లాభాల జోన్లోకి ఎంటర్ అయ్యాయంది`అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మెరుగైన నటనతో ఆకట్టుకున్నాడు. సోనూసూద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. దేవీశ్రీ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

క్రేజీ క్రియేటివిటీ.. గాలిలో ఎగురుతూ వచ్చిన మంగళసూత్రం.. తీసుకు వచ్చింది ఎవరో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో

Pawan Kalyan-Rana Movie Update: అప్పట్లో బాబాయ్ తో ఇప్పుడు అబ్బాయ్ తో పవన్ .. హీరోయిన్స్ వీరే అంటూ టాక్

Loading...
Unable to load recommendations.
Follow Us