
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు, నందమూరి మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రానికి ముహూర్తం ఖరారైంది. టాలీవుడ్ వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, మోక్షజ్ఞ తన తొలి చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. గతంలో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత సుమారు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న మోక్షజ్ఞ, తన కెరీర్ మొదటి సినిమా కోసం మరింత పకడ్బందీగా అడుగులు వేశారు. ఈ క్రమంలో పలువురు స్టార్ డైరెక్టర్ల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, చివరకు ‘బింబిసార’ చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ మల్లాడి వశిష్టను ఫైనల్ చేశారట బాలయ్య.
ఎక్కువ మంది చదివినవి : Cinema : మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్.. ప్రతి ఎపిసోడ్ సీటు అంచున కూర్చోబెట్టాల్సిందే.. ఓటీటీలో ఈ సిరీస్ అస్సలు మిస్ కాకండి..
వశిష్ట వినిపించిన వినూత్నమైన సోషియో-ఫాంటసీ కథాంశం బాలకృష్ణను ఎంతగానో ఆకట్టుకుందట. మోక్షజ్ఞ బాడీ లాంగ్వేజ్‌కు, నందమూరి వారసత్వ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా ఈ సబ్జెక్ట్ ఉండటంతో, బాలయ్య వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ప్రకటన కొంత ముందే రావాల్సి ఉంది. అయితే, ఇటీవల నందమూరి బాలకృష్ణ షూటింగ్‌లో గాయపడటం, మోకాలి శస్త్రచికిత్స కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం బాలయ్య పూర్తిగా కోలుకోవడంతో, చిత్ర యూనిట్ మళ్లీ సన్నాహాలను వేగవంతం చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫాంటసీ , మాస్ అంశాలతో సాగే ఈ సినిమాతో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కానుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. నందమూరి వంశం నుంచి వస్తున్న మరో వారసుడి తొలి అడుగులు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాలని, ఆయన ఘన విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..