సినీ పెద్దల సమావేశంపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!

కరోనా లాక్‌డౌన్‌ వేళ సిని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే షూటింగ్‌ల గురించి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్‌లోని కొందరు

సినీ పెద్దల సమావేశంపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 12:16 PM

కరోనా లాక్‌డౌన్‌ వేళ సిని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే షూటింగ్‌ల గురించి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్‌లోని కొందరు సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వంతో సినీ పెద్దలు సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలీదని అన్నారు. పత్రికలు, మీడియా ద్వారా ఈ విషయాన్ని తాను తెలుసుకున్నానని చెప్పారు.

ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో కూడా తనకు తెలీదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కరోనా వలన దెబ్బ తిన్న సినీ పరిశ్రమ పుంజుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టనుందని తెలిపారు. కొన్ని సడలింపులతో జూన్‌ రెండో వారంలో షూటింగ్‌లు ప్రారంభం అవుతాయని తాము భావిస్తున్నట్లు బాలయ్య పేర్కొన్నారు. అయితే కరోనా వలన సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సినిమాల షూటింగ్‌ల విషయంలో పలువురు సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్, మంత్రి తలసానిని కలిశారు. వారిలో చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో సినీ కార్మికులను ఆదుకుంటామని తెలిపిన కేసీఆర్, జూన్‌ నుంచి షూటింగ్‌లకు అనుమతిని ఇచ్చారు.

Read This Story Also: లాక్‌డౌన్‌ వర్కౌట్లు.. 20 కిలోలు తగ్గిన నారా లోకేష్‌..!