Ankita Lokhande: సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలి డ్యాన్స్ సూపర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Ankita Lokhande: బాలీవుడ్ వెటరన్ హారోయిన్ మాధురీ దీక్షిత్ పాపులర్ సింగ్‌కి సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే అదరిపోయే

Ankita Lokhande: సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలి డ్యాన్స్ సూపర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Edited By:

Updated on: Feb 07, 2021 | 12:30 PM

Ankita Lokhande: బాలీవుడ్ వెటరన్ హారోయిన్ మాధురీ దీక్షిత్ పాపులర్ సింగ్‌కి సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే అదరిపోయే స్టెప్పులేసారు. 2009లో హిందీలో ప్రారంభ‌మైన విత్ర రిశ్తా అనే టీవీ సీరియల్‌తో న‌టి అంకితా ఫేమస్ అయ్యారు. ఈ సీరియ‌ల్‌తో బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బుల్లితెరకు పరిచయమయ్యారు. ఈ సీరియ‌ల్ చేస్తున్న స‌మ‌యంలో సుశాంత్- అంకిత ప్రేమ‌లో ప‌డ‌గా, ఆరేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. 2016లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ – అంకిత లోఖండే ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే సుశాంత్ మ‌ర‌ణం అంకితాను చాలా వేధించింది.

అయితే సామాజిక మాధ్యమాలలో అంకిత చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫొటోస్, వీడియోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈమె మాధురీ దీక్షిత్ పాపుల‌ర్ సాంగ్ ధ‌క్ ధ‌క్ క‌ర్నే ల‌గా అనే పాట‌కు స్టెప్పులేసి అందుకు సంబంధించిన వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. చీర‌క‌ట్టులో ఈ అమ్ముడు న‌డుము తిప్పుతూ వేసిన డ్యాన్స్ నెటిజన్ల మనసులను దోచేస్తుంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

 

మిళ ఇండస్ట్రీలో ‘మాస్టర్’ సంచలనం.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన దళపతి సినిమా.. ఏంటో తెలుసా..