AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్ల కొట్టడం ఆయనకే సాధ్యం.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా బన్నీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు కొట్టడం ఆ హీరోకే సాధ్యమని అన్నారు బన్నీ. అసలేం జరిగిందంటే..

Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్ల కొట్టడం ఆయనకే సాధ్యం.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Oct 22, 2026 | 4:04 PM

Share

సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘జైలర్ 2’ థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ₹500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ , ‘జైలర్ 2’ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ‘జైలర్ 2’ సినిమా చూసిన అనంతరం అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. “#Jailer2 మైండ్ బ్లాకింగ్ మూవీ! రజినీకాంత్ గారి స్టార్ పవర్, స్వాగ్ , ఓరాకు ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ నిదర్శనం. రక్తాన్ని ఉడికించే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. నా సోదరుడు అనిరుధ్ మ్యూజిక్‌తో థియేటర్లలో అదరగొట్టేశాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ద షోమాన్ నెల్సన్ గారు మైండ్ బ్లాకింగ్ హిట్‌ను అందించారు. చొక్కా నలగకుండా ₹500 కోట్లు+ కొట్టడం ఒక్క రజినీ గారికే సాధ్యం! చిత్రయూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు!” అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..

అల్లు అర్జున్‌తో పాటు కమల్ హాసన్, ధనుష్, రితీష్ దేశ్‌ముఖ్, కార్తీక్ సుబ్బరాజ్, లింగుసామి వంటి ప్రముఖ నటులు, దర్శకులు కూడా ‘జైలర్ 2’ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా అని అన్నారు. రజినీకాంత్ స్టైల్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ , నెల్సన్ టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లలో విజిల్స్ వేసేలా చేస్తున్నాయి. అల్లు అర్జున్‌తో పాటు కమల్ హాసన్, ధనుష్, రితీష్ దేశ్‌ముఖ్, కార్తీక్ సుబ్బరాజ్, లింగుసామి వంటి ప్రముఖ నటులు, దర్శకులు కూడా ‘జైలర్ 2’ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌ అని అన్నారు. రజినీకాంత్ స్టైల్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ,నెల్సన్ టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లలో విజిల్స్ వేసేలా చేస్తున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, కృష్ణవంశీ కాంబోలో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..

జైలర్ మొదటి భాగం ‘జైలర్’ సంచలన విజయం సాధించడంతో, సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రాన్ని మరింత భారీ హంగులతో తెరకెక్కించారు. ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు పలువురు దిగ్గజ నటులు తెరను పంచుకున్నారు. మిథున్ చక్రవర్తి, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, విద్య బాలన్, హృతిక్ రోషన్ , ఎస్.జె. సూర్య వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కనిపించడంతో సినిమాపై హైప్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సినిమా మొదటి భాగంలో రజినీ ఎంట్రీ సీన్స్, ఎలివేషన్లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయని, సెకండ్ హాఫ్ మరింత బోనస్‌గా నిలిచిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. థియేటర్లలో ఫ్యాన్స్ పండుగ చేసుకునే రీతిలో సాగుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్, రజినీకాంత్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్..

అల్లు అర్జున్ ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‏లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!

Follow Us