
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి వెర్షన్‌కు రాసిన ఒక ప్రేమలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్కూల్ రోజుల్లో ఒక అబ్బాయి కోసం తాను చేసిన పనిని గుర్తు చేసుకుంటూ, తన భర్త గురించి ముందే ఊహించిన ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ఆమె పంచుకున్న ఆ ఎమోషనల్ అండ్ ఫన్నీ విషయాలు ఏంటో తెలుసుకుందాం..
అలియా భట్‌కు జంతువులంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. తన ఇంట్లో ఉండే ఎడ్వర్డ్, జునిపెర్ అనే పిల్లులతో ఆమె తరచుగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది. తాజాగా ఎస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పిల్లుల నుంచి నేర్చుకున్న పాఠాలను వివరించింది. “మిమ్మల్ని మీరు మరీ సీరియస్‌గా తీసుకోవద్దు. ఎవరి నుంచి ఎలాంటి అంచనాలు పెట్టుకోకండి. మీరు ఎంత తక్కువగా ఆశిస్తే, జీవితంలో అంత తక్కువ నిరాశ చెందుతారు. ప్రశాంతంగా నిద్రపోండి.. అప్పుడే జీవితం బాగుంటుంది” అని అలియా చెప్పుకొచ్చింది. జంతువుల నుంచి నేర్చుకున్న ఈ సరళమైన సూత్రాలే తన సక్సెస్‌కు కారణమని ఆమె నమ్ముతోంది.
Alia Bhatt…
ఈ ఇంటర్వ్యూలో అలియా తన చిన్ననాటి వెర్షన్‌ను ఉద్దేశించి రాసిన ఒక లేఖ అందరినీ ఆకట్టుకుంది. అందులో తన చిన్నప్పటి కలలను వదులుకోవద్దని కోరింది. “చిన్నారి అలియా.. నువ్వు ఎప్పుడూ కలలు కంటూనే ఉంటావని నాకు తెలుసు. దయచేసి కలలు కనడం ఆపకు. నీలో ఉన్న ఆ కలలే నీ అతిపెద్ద శక్తి” అని పేర్కొంది. ఈ మాటలు ఆమె ఎంతటి పట్టుదలతో తన కెరీర్‌ను నిర్మించుకుందో తెలియజేస్తున్నాయి.
తన టీనేజ్ రోజుల్లో జరిగిన ఒక చేదు జ్ఞాపకాన్ని అలియా సరదాగా గుర్తు చేసుకుంది. “హైస్కూల్‌లో ఆ మూర్ఖపు అబ్బాయి కోసం ఏడవద్దు. వాడు నీ కన్నీళ్లకు అస్సలు అర్హుడు కాదు. ఒక్క విషయం మాత్రం ప్రామిస్ చేస్తున్నాను.. ఒకరోజు నువ్వు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ అబ్బాయిని కలుస్తావు. అతను మరెవరో కాదు, నువ్వు రహస్యంగా ఇష్టపడే క్రష్ (రణబీర్ కపూర్)” అంటూ తన భర్త గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రణబీర్ పట్ల తనకున్న ప్రేమన అలియా ఈ విధంగా వ్యక్తం చేసింది.
మాతృత్వం గురించి మాట్లాడుతూ అలియా ఎంతో ఎమోషనల్ అయ్యింది. తనకు అత్యంత అందమైన కూతురు పుడుతుందని, తన హృదయం ఊహించని విధంగా ప్రేమతో నిండిపోతుందని ఆమె ఆ లేఖలో రాసుకుంది. తన కూతురు రహా గురించి ఒక ప్లేఫుల్ నోట్ లో ఇలా చెప్పింది.. “ఆమె ఒక చిన్న లాయర్ లాగా వ్యవహరించబోతోంది, కాబట్టి నువ్వు ఇప్పుడే సిద్ధంగా ఉండు” అంటూ నవ్వుతూ ముగించింది. కూతురు తెలివితేటలను అలియా ఈ విధంగా ప్రశంసించింది.
అలియా భట్ మాటలు వింటుంటే ఆమె ఎంతటి పరిణతి చెందిన వ్యక్తిగా మారిందో అర్థమవుతుంది. పెంపుడు జంతువుల నుంచి నేర్చుకున్న పాఠాలైనా, చిన్నప్పటి చేదు జ్ఞాపకాలను నెమరువేసుకోవడమైనా.. ఆమె నిజాయితీకి అందరూ ఫిదా అవుతున్నారు. మనిషిగా ఎదగాలంటే గతంలోని తప్పులను నవ్వుతూ అంగీకరించాలని అలియా నిరూపించింది.