ప్రభాస్ ‘ఆదిపురుష్‌’.. శివుడిగా ఆ టాప్‌‌ హీరో..!

రెబల్‌స్టార్ ప్రభాస్ ఇకపై ఫుల్ బిజీ అవ్వబోతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్‌లో నటిస్తోన్న ఈ హీరో

ప్రభాస్ 'ఆదిపురుష్‌'.. శివుడిగా ఆ టాప్‌‌ హీరో..!

Prabhas Adipurush movie: రెబల్‌స్టార్ ప్రభాస్ ఇకపై ఫుల్ బిజీ అవ్వబోతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్‌లో నటిస్తోన్న ఈ హీరో.. ఆ తరువాత నాగ్‌ అశ్విన్‌, ఓమ్ రౌత్ డైరెక్షన్‌లో నటించనున్నారు. ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇదిలా ఉంటే ఓమ్ రౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు తీసుకువెళ్లే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ క్రమంలో నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు దర్శకుడు. ముఖ్యంగా పౌరాణికం నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీలో పలు భాషల నుంచి స్టార్‌ నటీనటులు భాగం అవ్వబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కన్ఫర్మ్ అయ్యారు. ఇక ఇందులో శివుడి పాత్ర కూడా ఉండటంతో ఆ పాత్రకు గానూ అజయ్ దేవగన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

నిజానికి చెప్పాలంటే ఈ మూవీలో మొదట రావణాసురుడి పాత్రకు గానూ అజయ్‌నే సంప్రదించారట. అయితే డేట్లు అడ్జెస్ట్ అవ్వకపోవడంతో అందుకే ఆయన నో చెప్పారట. ఆ తరువాత సైఫ్‌ ఓకే చెప్పడంతో ఓమ్‌ రౌత్‌ అతడిని రావణాసురుడిగా కన్ఫర్మ్ చేశారు. ఇక అజయ్‌తో మంచి సాన్నిహిత్యం కలిగిన ఈ దర్శకుడు ఇందులో అతడిని ఒక పాత్రలోనైనా చూపించాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే శివుడి పాత్రకు అజయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ పాత్రకు అజయ్ ఒప్పుకుంటే, ఆదిపురుష్‌కి మరో అస్సెట్‌గా మారే అవకాశం ఉంది. కాగా అజయ్ దేవగన్.. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే.

Read More:

స్వల్ప లక్షణాలైనా.. ఆరోగ్యంపై కరోనా దీర్ఘకాలికంగా ప్రభావం..!

ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లిపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Click on your DTH Provider to Add TV9 Telugu