Viral Photo: సర్కారు వారి పాట సినిమా చూసేందుకు సీక్రెట్‌గా థియేటర్‌కు వెళ్లిన ఈ స్టార్‌ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Sarkaru Vaari Paata: ఓ స్టార్‌ హీరోయిన్‌ సర్కారు వారి పాట సినిమాకు సీక్రెట్‌గా వెళ్లింది. హైదరాబాద్‌లోని ఓ మల్టీఫ్లెక్స్‌లో ఎంచెక్కా సినిమా చూసింది. ఎవరికీ అనుమానం రాకుండా..

Viral Photo: సర్కారు వారి పాట సినిమా చూసేందుకు సీక్రెట్‌గా థియేటర్‌కు వెళ్లిన ఈ స్టార్‌ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
Viral Photos

Edited By:

Updated on: May 16, 2022 | 6:58 PM

Sarkaru Vaari Paata: ప్రస్తుతం టాలీవుడ్‌లో సర్కారు వారి పాట సినిమా హవా నడుస్తోంది. మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ మొదటి షో నుంచే హిట్ టాక్‌ తెచ్చుకుంఇ. దీంతో సినిమాను ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఈక్రమంలోనే కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఈ చిత్రం. మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది. కాగా మహేశ్‌కు ఉన్న లేడీ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదలైతే చాలు థియేటర్ల ముందు క్యూ కడుతుంటారు. ఇక సినిమా పరిశ్రమలోని చాలామంది హీరోయిన్లు కూడా మహేశ్‌ అంటే అభిమానం చూపిస్తారు. ఈనేపథ్యంలో ఓ స్టార్‌ హీరోయిన్‌ సర్కారు వారి పాట సినిమాకు సీక్రెట్‌గా వెళ్లింది. హైదరాబాద్‌లోని ఓ మల్టీఫ్లెక్స్‌లో ఎంచెక్కా సినిమా చూసింది. ఎవరికీ అనుమానం రాకుండా థియేటర్లోకి వచ్చేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి స్కార్ఫ్ అడ్డుపెట్టుకుంది. అయితే అక్కడే ఉన్న కెమెరా కళ్లు మాత్రం ఆమెను వదిలిపెట్టడం లేదు.

ఆమె మరెవరో కాదు సౌతిండియన్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయి పల్లవి. హైదరాబాద్‌లోని ఓ మల్టీఫ్లెక్స్‌లో ఆమె సీక్రెట్‌గా సర్కారు వారి పాట సినిమాను వీక్షించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా ఇలా సీక్రెట్‌గా సినిమాలకు వెళ్లడం సాయి పల్లవి కి కొత్తేమీ కాదు.. గతంలో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లా నాయక్‌ కు కూడా ఇదే రీతిలో వెళ్లి ఆశ్చర్యపరిచింది. కాగా మహేష్ కు తానూ పెద్ద అభిమానిని అని అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిందీ సొగసరి. అయితే ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా థియేటర్‌కు వెళితే ఫ్యాన్స్‌ ఎగబడతారు. ఫొటోలు, సెల్ఫీల కోసం పోటీపడతారు. అందుకే ఇలా సీక్రెట్‌గా వెళ్లిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Railway News: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఆ మార్గాల్లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే..

Hyderabad: బ్లూ ఫ్యాబ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ అనుమతులపై తేలని స్పష్టత.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..

Rashmika Mandanna: స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసిన రష్మిక.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

Loading...
Unable to load recommendations.
Follow Us