చిక్కుల్లో ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. భారత్‌ను వీడాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు..

ఆమీర్‌ ఖాన్‌ మేనల్లుడు, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు ముంబై పోలీసులు అక్టోబర్‌ 28లోగా భారత్‌ విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. ముంబైలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 10న జరిగిన నిరసనలో పాల్గొన్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికా పౌరుడైన ఇమ్రాన్‌ ఖాన్‌ వీసా, ఓసీఐ నిబంధనలను ఉల్లంఘించడంతో.. చర్యలు తీసుకున్నారు.

చిక్కుల్లో ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. భారత్‌ను వీడాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు..
Actor Imran Khan

Updated on: Oct 15, 2026 | 1:04 PM

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. అక్టోబర్ 28వ తేదీలోగా భారతదేశాన్ని విడిచి వెళ్లాలని (Leave India Notice) ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు. విదేశీ పౌరుడు కావడంతో దేశం విడిచి వెళ్లాలని.. నోటీసుల్లో స్పష్టంచేశారు. ఈ మేరకు విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO), ముంబై పోలీసు యంత్రాంగం ఆయనకు నోటీసులు జారీ చేసింది. రాజకీయ నిరసనల్లో పాల్గొని వీసా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ సిటిజన్‌గా ఉన్న ఇమ్రాన్‌ఖాన్.. ముంబైలో CEC జ్ఞానేశ్‌కుమార్‌కి వ్యతిరేకంగా జరిగిన సీజేపీ నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులతో పాటు ఇమ్రాన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌తో సహా పలువురిపై FIR నమోదు చేసిన పోలీసులు.. కొన్ని గంటల అనంతరం విడుదల చేశారు.

అయితే.. ఇమ్రాన్‌ఖాన్‌ పాల్గొనడంపై బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరసత్వం కలిగిన విదేశీయుడని, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI), వీసా నిబంధనల ప్రకారం విదేశీ పౌరులు భారతదేశంలో ఎటువంటి రాజకీయ ఆందోళనలు లేదా నిరసనల్లో పాల్గొనకూడదని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై విచారించిన పోలీసులు, ఓసీఐ కార్డు నిబంధనల ఉల్లంఘన క్రింద చర్యలు చేపడుతూ అక్టోబర్ 28 నాటికి దేశం వీడాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us