Allu Arjun: పుష్ప2 తర్వాత బన్నీ నటించే మూవీ అదేనా.? క్రేజీ కాంబినేషన్

పుష్ప పార్ట్‌1కి మించి సీక్వెల్ ఉండనుందని చిత్ర యూనిట్ చెబుతోది. ఇదిలా ఉంటే బన్నీ వెండి తెరపై కనిపించి ఇప్పటికే దాదాపు మూడేళ్లు గడుస్తోంది. దీంతో బన్నీని ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూద్దామా అని ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప2 చివరి దశకు చేరుకున్న తరుణంలో బన్నీ తర్వాత సినిమా ఏంటన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది...

Allu Arjun: పుష్ప2 తర్వాత బన్నీ నటించే మూవీ అదేనా.? క్రేజీ కాంబినేషన్
Alluarjun
Follow us

|

Updated on: Sep 17, 2024 | 8:22 AM

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే సుకుమార్ పుష్ప2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

పుష్ప పార్ట్‌1కి మించి సీక్వెల్ ఉండనుందని చిత్ర యూనిట్ చెబుతోది. ఇదిలా ఉంటే బన్నీ వెండి తెరపై కనిపించి ఇప్పటికే దాదాపు మూడేళ్లు గడుస్తోంది. దీంతో బన్నీని ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూద్దామా అని ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప2 చివరి దశకు చేరుకున్న తరుణంలో బన్నీ తర్వాత సినిమా ఏంటన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు బన్నీ తన తర్వాతి చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇందుకు సంబంధించి కొన్ని వార్తలు మాత్రం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

అల్లుఅర్జున్‌ తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. జవాన్‌తో పాన్‌ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అట్లీ, బన్నీతో ఓ భారీ పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పుష్ప2 తర్వాత బన్నీ చిత్రం ఇదేనంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. బన్నీ, త్రివిక్రమ్‌ మరోసారి చేతుల కలపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలతో హ్యాట్రిక్‌ సొంతం చేసుకున్న వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోందని తెలుస్తోంది. త్రివిక్రమ్‌ బన్నీతో భారీ పాన్ ఇండియా మూవీని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ కాన్వాస్ ఉన్న కథను సిద్ధం చేశారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభంకానునన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..