సమంత తన జీవితంలో ఒక రోజు ఎలా గడుస్తుందన్న వివారలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. తన దినచర్య ఎలా ఉంటుందన్న వివరాలను అభిమానులతో షేర్ చేసుకుంది.
ఉదయం నిద్రలేచిన వెంటనే సమంత సూర్యరశ్మిలో గడపడం ద్వారా తన రోజును ప్రారంభిస్తానని తెలిపింది. ఉదయం కచ్చితంగా కాసేపు ఎండలో ఉండడంతో తన రోజును ప్రారంభిస్తుంది.
ఇక చర్మ ఆరోగ్యం కోసం సమంత ప్రతీరోజూ కచ్చితంగా ఆయిల్ పుల్లింగ్ చేస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంతో పాటు.. ప్రకాశవంతంగా మారేందుకు ఉపయోగపడుతుంది.
ఆయిల్ పుల్లింగ్ చేసిన తర్వాత.. గువా షా టూల్ ను ఉపయోగిస్తుంది. ఈ సాంప్రదాయ చైనీస్ విధానం ముఖాన్ని మసాజ్ చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
ఇక సమంత తన కంటి రక్షణ కోసం ఎల్ఈడీ ఐ మాస్క్ ఉపయోగిస్తుంది. ఈ మాస్క్ సహాయంతో కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మాన్ని లక్ష్యంగా చేసి నల్లటి వలయాలు, ఉబ్బు, సన్నని గీతలను తగ్గిస్తుంది.
షూటింగ్స్ ఏవైనా వుంటే అంతకు ముందు ఐస్ వాటర్ ఉన్న బకెట్‌లో కాసేపు ముఖం ఉంచుతుంది. ఇది ముఖం ఉబ్బును తగ్గించడానికి, చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడానికి ఉపయోగపడుతుంది.
మధ్యాహ్నం రెడ్ లైట్ థెరపీ సెషన్ తీసుకుంటుంది సామ్. తక్కువ కాంతినిచ్చే ఎరుపు రంగు ఎల్‌ఈడీ లైట్స్‌తో చేసే ఈ చికిత్స ముడతలను తగ్గించడానికి ఉపయోపగడతాయి.
ఇక రాత్రి నిద్రపోయే ముందు కొంత సేపు ధ్యానం చేస్తుంది. ఆ తర్వాత నిద్రకు ఉపక్రమిస్తుంది. ఇలా తన రోజును ముగిస్తుంది సామ్.