Bigg Boss 10 Telugu: తోపులు వస్తున్నారు.. బిగ్‏బాస్ 10లోకి ఊహించని సెలబ్రెటీస్.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ ఆది రెడ్డి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. తన సోషల్ మీడియా ఖాతాలో ఈసారి హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్న కంటెస్టెంట్ల జాబితాను వెల్లడించారు. ఇందులో ఊహించని సెలబ్రెటీస్ సైతం రాబోతున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 10 Telugu: తోపులు వస్తున్నారు.. బిగ్‏బాస్ 10లోకి ఊహించని సెలబ్రెటీస్.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే..
Bigg Boss 10 Telugu

Updated on: Sep 02, 2026 | 8:22 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం ఎదురుచూస్తున్న అభిమానుల గురించి తెలిసిందే. మరో నాలుగైదు రోజుల్లోనే ఈ షో గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. దీంతో ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ ఆది రెడ్డి తాజా అప్‌డేట్స్‌తో పాటు, హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్న కంటెస్టెంట్ల పూర్తి జాబితాను, వారి నేపథ్యాలను వివరించారు. ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారడానికి వివిధ రంగాల నుండి ఎంపికైన కంటెస్టెంట్లు కీలకం కానున్నారని చెప్పుకొచ్చారు. ఆది రెడ్డి చెప్పిన లిస్ట్ ప్రకారం చూస్తుంటే.. ఈసారి హౌస్ లోకి కామనర్లతోపాటు సీరియల్ నటీనటులు, యంగ్ హీరోహీరోయిన్, టాలీవుడ్ నటులు సైతం ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతకీ ఆ లిస్ట్ ఏంటో చూద్దామా.

అదిత్ ఈశ్వరన్: “చెన్నై లవ్ స్టోరీ” చిత్రంలో సెకండ్ హీరోగా నటించిన అదిత్ ఈశ్వరన్, యంగ్, ఫిట్‌గా ఉంటారు. ఒకటి రెండు చిత్రాలలో హీరోగా చేసి, ఒక సూపర్ హిట్ సినిమాలో భాగమవడం వల్ల అతనికి మంచి గుర్తింపు ఉంది. మంచి రెమ్యూనరేషన్‌తో బిగ్ బాస్ ఆఫర్‌ను అంగీకరించినట్లు తెలుస్తోంది.

రోహిత్ (కామనర్): “అగ్నిపరీక్ష” ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించిన రోహిత్, అద్భుతమైన ప్రదర్శనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. టాస్క్‌లలో చురుగ్గా పాల్గొనడం, డ్యాన్స్‌లు చేయడం, పాటలు పాడటం వంటి అనేక టాలెంట్లను ప్రదర్శించారు. కోపాన్ని ప్రదర్శించడం, అమాయకంగా కనిపించడం వంటి బిగ్ బాస్‌కు అవసరమైన అన్ని కోణాలను ఆయన ప్రదర్శించారు.

కృష్ణుడు: “వినాయకుడు” చిత్రంతో హీరోగా పరిచయమైన కృష్ణుడు, ఒకప్పుడు కాస్త బరువు ఎక్కువగా ఉండేవారు. ప్రస్తుతం బరువు తగ్గి, మరింత ఫిట్‌గా మారారు. ఆయన చాలా మంచి వ్యక్తిగా, ఇన్నోసెంట్ స్వభావం కలవారిగా పేరు పొందారు. నాగ చైతన్యతో కలిసి “యే మాయ చేశావే” వంటి అనేక చిత్రాలలో నటించారు. ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో, బిగ్ బాస్ వేదికగా తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నారు.

శాలిని: శాలిని హౌస్‌లోకి వచ్చే అవకాశం 95% ఉందని ఆది రెడ్డి అంచనా వేశారు. ఆమె వివాదాస్పద స్వభావం, ఒక్కోసారి రూడ్‌గా మాట్లాడటం, ఓవర్ యాటిట్యూడ్‌ను ప్రదర్శించడం బిగ్ బాస్ షోకు ఎంతో ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయం. ఆమె దూకుడు స్వభావం, లవ్ ట్రాక్‌ల కోసం లేదా విభిన్నమైన వ్యక్తిత్వం కోసం ఆమెను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ శాలిని రాకపోతే, ఆమె స్థానంలో అపూర్వ రావచ్చని సమాచారం.

ముఖేష్ గౌడ (అలియాస్ రంగా, అలియాస్ రిషి): అత్యంత పాపులర్ అయిన ముఖేష్ గౌడ, గుప్పెడంత మనసు సీరియల్‌లో కాలేజీ ఓనర్‌గా “రిషి” పాత్రలో, ఆటో డ్రైవర్‌గా “రంగా” పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన పాపులారిటీ ఎంత ఎక్కువగా ఉందంటే, ఆయన వస్తున్నారని తెలియగానే అభిమానుల నుండి విపరీతమైన స్పందన వచ్చిందని ఆది రెడ్డి తెలిపారు. ముఖేష్ గౌడ రాకతో టీఆర్పీలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆది రెడ్డి అన్నారు.

ఆటో రాంప్రసాద్: జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆటో రాంప్రసాద్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. సుధీర్ టీంలో సభ్యుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే, ఆయన తరచుగా ఉపయోగించే “ఆటో పంచెస్” కొన్నిసార్లు నెగటివిటీకి దారితీసే అవకాశం ఉందని ఆది రెడ్డి అంచనా వేశారు.

టెంపర్ వంశీ : ‘టెంపర్’ సినిమా ఫేమ్ క్యారెక్టర్/విలన్ ఆర్టిస్ట్

సృష్టి వ్యాకరణం (Srushti Vyakaranam) : మోడల్ & ఫిట్‌నెస్ ఫ్రీక్.

ఆర్జే చరణ్ : ‘అగ్ని పరీక్ష’ ఆర్జే / ఎంటర్‌టైనర్.

వర్షిణి సౌందరరాజన్ : ప్రముఖ యాంకర్ & నటి.

జాన్సీ: రైతు, సింగర్ (‘అగ్ని పరీక్ష’ ద్వారా నేరుగా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్).

నరేష్: ‘జబర్దస్త్’ నరేష్ (పొట్టి నరేష్).

దేబ్జానీ మోదక్: సీరియల్ నటి & ‘కుక్ విత్ జాతిరత్నాలు’ ఫేమ్.

చైత్ర రాయ్: ప్రముఖ సీరియల్ నటి.

నవరసాలు ఆర్కే: ‘అగ్ని పరీక్ష’ కామనర్ కంటెస్టెంట్.

సుధీర్ రెడ్డి : పోడ్‌కాస్టర్ & ఇన్‌ఫ్లుయెన్సర్.

ఈసారి బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ విభిన్నమైన నేపథ్యాలు, వ్యక్తిత్వాలు కలిగిన కంటెస్టెంట్లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ కంటెస్టెంట్లు హౌస్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తారు, ఎవరు విజేతగా నిలుస్తారు అనేది వేచి చూడాలి.

ముకేష్ గౌడ..

వర్షిణి సౌందర్యరాజన్..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

Loading...
Unable to load recommendations.
Follow Us