నితీశ్ కుమార్ ‘గో బ్యాక్’…?

బిహార్ లో మెదడువాపు వ్యాధితో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో వ్యాధిగ్రస్థుల బంధువులు కోపోద్రిక్తులవుతున్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బిహార్‌లో మెదడువాపు వ్యాధి గత రెండు వారాలుగా ప్రజలను వేధిస్తోంది. వ్యాధి సోకినవారు ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ మంగళవారం ముజఫర్‌పూర్‌లోని శ్రీకృష్ణ వైద్య కళాశాల, ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్నవారిని, వారి బంధువులను పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి, […]

నితీశ్ కుమార్ ‘గో బ్యాక్’...?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2019 | 9:28 PM

బిహార్ లో మెదడువాపు వ్యాధితో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో వ్యాధిగ్రస్థుల బంధువులు కోపోద్రిక్తులవుతున్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

బిహార్‌లో మెదడువాపు వ్యాధి గత రెండు వారాలుగా ప్రజలను వేధిస్తోంది. వ్యాధి సోకినవారు ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ మంగళవారం ముజఫర్‌పూర్‌లోని శ్రీకృష్ణ వైద్య కళాశాల, ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్నవారిని, వారి బంధువులను పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి, పరిస్థితిని సమీక్షించారు. అయితే ప్రభుత్వ చర్యలపై అసంతృప్తితో రగిలిపోతున్నవారు నితీశ్ కుమార్ ‘గో బ్యాక్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మెదడువాపు వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 108 మంది బాలలు మరణించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.