హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ్లి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా.. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే అక్టోబర్‌ 1న నామినేషన్లు పరిశీలించనుండగా.. అక్టోబర్‌ 3 వరకు ఉపసంహరణ గడువునిచ్చారు. ఇక అక్టోబర్‌ 21న పోలింగ్‌ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు చేశారు. కాగా ఎంపీగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:29 pm, Mon, 23 September 19

సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ్లి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా.. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే అక్టోబర్‌ 1న నామినేషన్లు పరిశీలించనుండగా.. అక్టోబర్‌ 3 వరకు ఉపసంహరణ గడువునిచ్చారు. ఇక అక్టోబర్‌ 21న పోలింగ్‌ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు చేశారు.

కాగా ఎంపీగా గెలిచిన తరువాత హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్‌కు పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావటంతో ఈ ఉప ఎన్నిక.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండు ప్రభుత్వాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక ఈ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్‌ తరఫున ఉత్తమ్ సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పేరు దాదాపుగా ఖరారు కాగా.. బీజేపీ అభ్యర్థిపై ఇంకా సంగ్ధిగ్దత కొనసాగుతోంది.