ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1950.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా?

మన ఓటు హక్కుకు సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే, ఫిర్యాదు చేయాలనుకుంటే, ఇంకా ఇతరత్రా ఏదైనా సమస్య ఏర్పడితే అందుకోసం ఎన్నికల సంఘం ఓ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేసింది. అదే 1950 నంబర్‌. ఈ నంబర్‌కు కాల్‌చేసి మన ఓటు గురించి సమాచారం తెలుసుకోవచ్చు. సమాచారం ఇవ్వడంతోపాటు అభిప్రాయాలు తీసుకోవడం, సలహాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ కేంద్రం సిబ్బంది చేస్తారు. ఈ నంబర్‌తో ప్రతి జిల్లా కలెక్టరేట్‌లోని కాంటాక్ట్‌ సెంటర్‌ ద్వారా సేవలు […]

ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1950.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2019 | 3:04 PM

మన ఓటు హక్కుకు సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే, ఫిర్యాదు చేయాలనుకుంటే, ఇంకా ఇతరత్రా ఏదైనా సమస్య ఏర్పడితే అందుకోసం ఎన్నికల సంఘం ఓ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేసింది. అదే 1950 నంబర్‌. ఈ నంబర్‌కు కాల్‌చేసి మన ఓటు గురించి సమాచారం తెలుసుకోవచ్చు. సమాచారం ఇవ్వడంతోపాటు అభిప్రాయాలు తీసుకోవడం, సలహాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ కేంద్రం సిబ్బంది చేస్తారు. ఈ నంబర్‌తో ప్రతి జిల్లా కలెక్టరేట్‌లోని కాంటాక్ట్‌ సెంటర్‌ ద్వారా సేవలు అందిస్తారు. ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ఈ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ నంబర్‌ను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేసిందో తెలుసా? భారత ఎన్నిక సంఘం 1950 జనవరి 25న ఏర్పాటైంది. అదే సంవత్సరాన్ని హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కేటాయించింది. 1950 నంబర్‌ను కేటాయించడానికి అసలు కారణం అదన్నమాట.