సుమలత, నిఖిల్ గౌడ సినిమాలు ప్రసారం చేయకండి: ఈసీ

బెంగళూరు: కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ స్థానం నుంచి ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్‌ గౌడలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ఈ ఇరువురు సినీ తారలకు షాకిచ్చింది. దూరదర్శన్‌లో వీరి సినిమాల ప్రసారంపై నిషేధం విధించింది. మాండ్యలో ఎన్నికలు పూర్తయ్యేవరకూ సుమలత, నిఖిల్‌ గౌడల సినిమాలు దూరదర్శన్‌లో ప్రసారం చేయకూడదంటూ ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల డిప్యూటీ కమిషనర్, రిటర్నింగ్ అధికారి మంజుశ్రీ బుధవారం […]

సుమలత, నిఖిల్ గౌడ సినిమాలు ప్రసారం చేయకండి: ఈసీ
Follow us

|

Updated on: Mar 20, 2019 | 4:11 PM

బెంగళూరు: కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ స్థానం నుంచి ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్‌ గౌడలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ఈ ఇరువురు సినీ తారలకు షాకిచ్చింది. దూరదర్శన్‌లో వీరి సినిమాల ప్రసారంపై నిషేధం విధించింది. మాండ్యలో ఎన్నికలు పూర్తయ్యేవరకూ సుమలత, నిఖిల్‌ గౌడల సినిమాలు దూరదర్శన్‌లో ప్రసారం చేయకూడదంటూ ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల డిప్యూటీ కమిషనర్, రిటర్నింగ్ అధికారి మంజుశ్రీ బుధవారం ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు. అయితే ప్రయివేటు టీవీ ఛానళ్లకు ఈ నిషేధం విషయంలో ఎటువంటి మార్గనిర్ధేశకాలు విడుదల చేయలేదు. కాబట్టి ఆయా ఛానల్లలో వీరి సినిమాల ప్రసారాలు యాధావిధిగానే ప్రసారం కానున్నాయి.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం ఆసక్తికర పోరుకు వేదికైంది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో సుమలత భర్త,కన్నడ రెబల్ స్టార్, కాంగ్రెస్‌ నేత అంబరీష్‌ పలుసార్లు ఎన్నికై కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. గతేడాది చివర్లో అనారోగ్యంతో అంబరీష్‌ మరణించారు. దీంతో ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు సుమలత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రానున్న ఎన్నికల్లో సుమలత మండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ సీటు ఆశించారు. అయితే అలయన్స్‌లో భాగంగా ఈ సీటును కాంగ్రెస్‌ తమ మిత్రపక్షమైన జేడీఎస్‌కు కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురైన సుమలత ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు.

అటు సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్‌ గౌడ ఈ ఎన్నికలతో రాజకీయ ప్రవేశానికి సిద్దమయ్యారు. దీంతో తమకు కంచుకోట అయిన మాండ్య నుంచి నిఖిల్‌ను జేడీఎస్‌ పోటీకి దింపుతోంది. ఈ నేపథ్యంలో మాండ్య పోరు ఆసక్తికరంగా మారింది. కాగా కేజీఎఫ్ స్టార్ హీరోొ యశ్ ఇప్పటికే సుమలతకు మద్ధకు ప్రకటించారు. త్వరలోనే ఆవిడ తరుపున ప్రచారంలో కూడా పాల్గొననున్నారు. మరి ఈ ‘సిని’ పొలిటికల్ వార్‌లో ఎవరు విజేతలుగా నిలుస్తారో చూడాలి