కోల్‌కతాలో ఓ చోట రీపోలింగ్

పశ్చిమ బెంగాల్ : కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం 200వ పోలింగ్‌ కేంద్రంలో చివరి విడతలో ఈనెల 19న జరిగిన  పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.  అక్కడ రీపోలింగ్‌కు ఆదేశించింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం 200వ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహించాలని బెంగాల్ సీఈఓని  ఆదేశించింది. మే 22న జరగనున్న ఈ ఎన్నికకు ఈ అధికారులు ఏర్పాట్లు చేయాలని, ఆ పోలింగ్ […]

కోల్‌కతాలో ఓ చోట రీపోలింగ్
Follow us

|

Updated on: May 21, 2019 | 2:18 PM

పశ్చిమ బెంగాల్ : కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం 200వ పోలింగ్‌ కేంద్రంలో చివరి విడతలో ఈనెల 19న జరిగిన  పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.  అక్కడ రీపోలింగ్‌కు ఆదేశించింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం 200వ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహించాలని బెంగాల్ సీఈఓని  ఆదేశించింది. మే 22న జరగనున్న ఈ ఎన్నికకు ఈ అధికారులు ఏర్పాట్లు చేయాలని, ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లకు సమాచారం చేరేలా ప్రచారం చేయాలని సూచించింది. ఈ  కేంద్రం జోర్సంకో అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది.

సోమవారం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌, బీజేపీ  ప్రతినిధులు పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు జరిగిన కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని, తమ నేతలపై నమోదైన తప్పుడు కేసులను కొట్టివేయాలని ఈసీని కోరారు.