Breaking News
  • ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా నాగభూషయ్య . ఖమ్మం వైస్‌ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. ఖమ్మం డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాసరావు ఎన్నిక.
  • మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాషా.. వైస్‌ చైర్మన్‌గా కొర్రమొని వెంకటయ్య. మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌ ఎన్నిక.
  • మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నిక. వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శివకుమార్‌ .
  • నల్గొండ డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాక్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వట్టె జానయ్య. వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి.
  • వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌రావు.. వైస్‌ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రామస్వామినాయక్‌ వైస్‌ చైర్మన్‌గా దేశిని శ్రీనివాస్‌రెడ్డి.

నాగార్జున సాగర్‌లోని చేపలు తింటున్నారా..? ఇక అంతే..!!

Eating fish from Nagarjuna Sagar may pose health threat, నాగార్జున సాగర్‌లోని చేపలు తింటున్నారా..? ఇక అంతే..!!

మీరు ఇప్పుడు నాగార్జున సాగర్‌కి వెళ్తున్నారా..? అక్కడే ఉన్న చేపలను తింటున్నారా..? అయితే.. మీకో షాకింగ్ న్యూస్..!

నాగార్జున సాగర్‌.. ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు. అందులోనూ.. ఆ జలపాతాలను చూస్తే.. ఎంతసేపైనా.. అక్కడే ఉండాలనిపిస్తుంది. అందుకే.. నాగార్జున సాగర్‌కి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పైనుంచి కిందకు జాలు వారుతున్న నీటి అందాలు చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతారు. ఆ అపురూప దృశ్యం చూసి పరవశించిపోతారు. ఇక అందులోనూ ఆదివారమైతే.. నాగార్జున సాగర్‌కు పర్యాటకులు పోటెత్తుతారు. దీంతో.. కిలో మీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. అందులోనూ.. చల్లటి సాయంత్రం వేళ.. సాగర్.. శబ్ధాల నడుమ.. అక్కడ సేద తీరుతూ.. కొంతమంది పర్యాటకులు.. అక్కడే ఉన్న కాలువల్లోనుంచి.. చేపలను పట్టి.. ఫ్రై రూపంలో.. లేక పులుసులా వండించుకుని తింటారు. అదో రకమైన ఆనందానుభూతి.

కానీ.. ఈ సమయంలో.. మాత్రం తింటే.. మీరు ఖచ్చితంగా అనారోగ్యానికి గురవుతారు..! ఎందుకని అనుకుంటున్నారా..! నాగార్జున సాగర్‌ నీటిలో.. యురేనియం కలుస్తుందట. అది ప్రాణానికి ఎంత హాని చేస్తుందో.. మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. ఈ మధ్య యురేనియం తవ్వకాలపై.. పెద్ద ఎత్తున ఆందోళనలు అల్లుకున్నాయి. అందులోనూ.. అక్కడే తిరిగాడే.. చేపలను తింటే.. ఉన్న ఆరోగ్యం పక్కన పెడితే.. లేనిపోని సమస్యలు మరిన్ని ఎక్కువవుతాయి.

యురేనియం వల్ల కలిగే నష్టాలు:

యురేనియంలో.. సీసం 75 శాతం అధికంగా ఉంటుంది.
ఇక నీటిలో కలిస్తే.. మానవుడు చాలా దుష్పలితాలకు గురికావాల్సి ఉంటుంది
యురేనియం కలిసిన నీటిని ఒక్కసారి తాగినా ప్రమాదకరమే.
దీని వల్ల జన్యుపరమైన లోపాలు తలెత్తుతాయి.
యురేనియంలోని గామా కిరణాలు ఉంటాయి. ఇది ఎంతటి బలమైన కాంక్రీటునైనా విచ్ఛిన్నం చేయగలిగే శక్తి ఉంటుంది.

Related Tags