లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ఎంసెట్‌ దరఖాస్తుల గడువు పెంపు..

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన వివిధ ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మరికొన్నింటికి దరఖాస్తు గడువులను పొడించారు అధికారులు. వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ఎంట్రెన్స్‌ కోసం ప్రతి ఏటా అర్హత కోసం పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించింది ఉన్నత విద్యామండలి. లాక్‌డౌన్‌ ఈనెల 15వ తేదీ వరకు ఉన్న నేపథ్యంలో ఈ దరుఖాస్తు స్వీకరణ […]

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ఎంసెట్‌ దరఖాస్తుల గడువు పెంపు..
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2020 | 3:20 PM

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన వివిధ ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మరికొన్నింటికి దరఖాస్తు గడువులను పొడించారు అధికారులు. వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ఎంట్రెన్స్‌ కోసం ప్రతి ఏటా అర్హత కోసం పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించింది ఉన్నత విద్యామండలి.

లాక్‌డౌన్‌ ఈనెల 15వ తేదీ వరకు ఉన్న నేపథ్యంలో ఈ దరుఖాస్తు స్వీకరణ గడువు పొడిగించినట్టు తెలుస్తోంది. ఈ ఎంట్రెన్స్ పరీక్షకే కాకుండా.. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్‌ దరఖాస్తుల గడువులను కూడా పొడిగించారు అధికారులు. అయితే ఐసెట్ దరఖాస్తుల స్వీకర మాత్రం ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉంటుంది. ఇక మే నెల తొలి వారంలో నిర్వహించాల్సిన ఎంసెట్ పరీక్షలు వాయిదా పడనున్నాయి.