Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

ఈ ‘టీ’తో ఒత్తిడి ఆమడదూరం!

Drinking Matcha tea can reduce anxiety, ఈ ‘టీ’తో ఒత్తిడి ఆమడదూరం!

ప్రస్తుత జనరేషన్‌లో ఒత్తిడి లేకుండా బ్రతకడం చాలా కష్టమే! కానీ ఆ ఒత్తిడిని దూరం చేసుకోడానికి మాత్రం బోలెడన్నీ మార్గాలున్నాయి. వాటిలో ఒకటి ‘మాచా టీ’.  అవును నిజమే.. జపనీయులు తాగే మాచా టీ తాగితే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్ అనే కథనంలో సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచా పౌడర్ లేదా మాచా ఎక్స్‌ట్రాక్ట్‌లను వాడి ఎలుకలపై చేసిన ప్రయోగాలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆందోళనగా, కంగారుగా కనిపించిన ఎలుకలు మాచా టీ పౌడర్‌తో ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాయని సైంటిస్టులు గుర్తించారు.

పరిశోధకులు చెబుతున్న ప్రకారం.. మాచా టీని తాగడం వల్ల ఆ పొడిలో ఉండే ఔషధ కారకాలు మన శరీరంలో డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లను యాక్టివేట్ చేస్తాయట. దీంతో మనస్సు రిలాక్స్ అవుతుంది. ప్రశాంతంగా మారుతారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇతర అన్ని మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ఈ సమస్యల నుంచి బయట పడాలంటే నిత్యం మాచా టీని మీరు కూడా ప్రిపర్ చేయండి.