హిరణ్య కశ్యపుడు..ఈ దగ్గుబాటి వారసుడు

రానా దగ్గుబాటి…హద్దుల్లేని నటుడు. స్టార్‌గా కంటే నటుడిగా తనని తాను ఆవిష్కరించుకునేందుకు నిత్యం ఆరాటపడుతుంటాడు. అందుకే అతను విభిన్న భాషలలో.. భిన్నమైన ప్రాజెక్టులు చేస్తూ ముందుకు సాగిపోతోన్నాడు. కేవలం హీరోగానే కాదు..పాత్రలో వైవిధ్యం ఉంటే చాలు సహయ నటుడిగా సైతం చెలరేగిపోతాడు. రానా సినిమా కోసం ఎంత కష్టపడతాడో బాహుబలి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది.  క్యారెక్టర్ లో జీవించడం కోసం నిత్యం శ్రమిస్తాడు. రానా చేతిలో హిందీ, తెలుగు, మలయాళం సినిమాలు ఉన్నాయి.  […]

హిరణ్య కశ్యపుడు..ఈ దగ్గుబాటి వారసుడు
Follow us

|

Updated on: Jun 01, 2019 | 3:38 PM

రానా దగ్గుబాటి…హద్దుల్లేని నటుడు. స్టార్‌గా కంటే నటుడిగా తనని తాను ఆవిష్కరించుకునేందుకు నిత్యం ఆరాటపడుతుంటాడు. అందుకే అతను విభిన్న భాషలలో.. భిన్నమైన ప్రాజెక్టులు చేస్తూ ముందుకు సాగిపోతోన్నాడు. కేవలం హీరోగానే కాదు..పాత్రలో వైవిధ్యం ఉంటే చాలు సహయ నటుడిగా సైతం చెలరేగిపోతాడు. రానా సినిమా కోసం ఎంత కష్టపడతాడో బాహుబలి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది.  క్యారెక్టర్ లో జీవించడం కోసం నిత్యం శ్రమిస్తాడు.

రానా చేతిలో హిందీ, తెలుగు, మలయాళం సినిమాలు ఉన్నాయి.  ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్ రానా చేతికి అందబోతున్నది.  టాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ హిరణ్య కశ్యప అనే కథతో సినిమాను రెడీ చేస్తున్నాడు.  పురాణకాలం నాటి కథతో మూవీని తెరకెక్కిస్తున్నారు.  హిరణ్య కశ్యప ప్రహ్లాదుడి తండ్రి.  రాక్షస జాతికి చెందినవాడు.  మూడు సంవత్సరాల పాటు ఈ కథపై పరిశోధన చేసి సినిమాను రెడీ చేశారట దర్శకుడు గుణశేఖర్.  పూర్తి డీటెయిల్స్ త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం.