ఈ పోలీస్ అధికారిపై వేటు పడింది…

ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చాడు. పలాస మండలం టెక్కలి పట్టణానికి చెందిన జగన్‌...

ఈ పోలీస్ అధికారిపై వేటు పడింది...
Follow us

|

Updated on: Aug 05, 2020 | 5:38 PM

ఓ యుకుడిని అకారణంగా కాలుతో తన్ని.. దుర్బాషలాడిన ఖాకీపై వేటు పడింది. న్యాయం కొసం వచ్చిన దళిత యువకుడిని కొట్టడంతో పాటు.. నీకు ఎంత ధైర్యంరా అంటూ దూషించిన CIపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఏపీ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చాడు. పలాస మండలం టెక్కలి పట్టణానికి చెందిన జగన్‌. సీఐని కలిసి బాధితుడు ఫిర్యాదు చేశాడు. న్యాయం చెయ్యాల్సిన సీఐ.. తన పనిని బూటుకు చెప్పాడు. మెదడు మొకాళ్లలో ఉన్నట్టుగా బూటు కాలుతో బాధితుడిని తన్నాడు. అంతటితో ఆగకుండా కొట్టి, నోటికొచ్చినట్టు దూషిస్తూ తన దైన శైలిలో దురుషుగా ప్రవర్తించాడు.

దీనంతటిని అక్కడ ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఆ వీడియో సంచలనంగా సృష్టించింది. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ బర్దర్‌ డీజీపీకి రిపోర్ట్‌ ఇచ్చారు. ఈ ఘటనపై సీరియస్‌ అయిన డీజీపీ.. సదరు సీఐపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా సేవలో ఉన్న వారు ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ బర్దర్‌ హెచ్చరించారు.

ఈ ఘటనపై బాధితుడి వాదన మరోలా ఉంది. తనకు జరిగిన అన్యాయంపై ఆవేశంతో సీఐని అనరాని మాటలు అన్నానంటూ క్లారిటీ ఇస్తున్నారు. ఈ విషయంలో సీఐ తప్పేమి లేదంటున్నారు.