Breaking News
  • ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. దిశ చట్టంపై జగన్‌ను అభినందించిన అనిల్‌ దేశ్‌ముఖ్‌. మహారాష్ట్రలో దిశ చట్టం అమలుకు పరిశీలిస్తామన్న దేశ్‌ముఖ్‌.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం. 12.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.44 కోట్లు ఉంటుందని అంచనా. మలేషియా, సింగపూర్‌ నుంచి బంగారం తరలిస్తున్నట్టు గుర్తింపు. 18 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.
  • స్థానిక ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి నేతృత్వంలో కమిటీ వేశాం. రాజధాని అమరావతిలోనే ఉండేలా కార్యాచరణ ప్రకటిస్తాం-కన్నా. ఎంపీల గైర్హాజరును పెద్దది చేయాల్సిన అవసరం లేదు. వారివారి వ్యక్తిగత కారణాలతో రాలేమని ముందే చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించి నాకు సమాచారం లేదు. ఈనెల 25లోగా టీఎస్‌ కొత్త అధ్యక్షుడిపై స్పష్టత వస్తుంది. -ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
  • ఢిల్లీ: షాహిన్‌బాగ్‌లో ఆందోళనకారులతో మధ్యవర్తుల చర్చలు. ఎటూ తేలకుండానే రెండో రోజు ముగిసిన చర్చలు. ఆందోళనలు విరమించాలని షాహిన్‌బాగ్‌ వాసులను కోరిన మధ్యవర్తులు. సీఏఏను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న ఆందోళనకారులు. నిరసనలు చేసుకోవచ్చు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న మధ్యవర్తులు. లేదంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందన్న మధ్యవర్తులు.
  • ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను.. అది కేంద్ర నిర్ణయం. మాకు ఎవరితోనూ పొత్తు లేదు.. జనసేనతో మాత్రమే మా పొత్తు -మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి.
  • విజయవాడ: వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో విచారణ. విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.

రూ.100 కోట్ల హెరాయిన్..పక్కా స్కెచ్..బట్..!

Delhi Police recover heroin worth Rs 100 crore, రూ.100 కోట్ల హెరాయిన్..పక్కా స్కెచ్..బట్..!

మత్తుమందు ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్కల్లో ఒకటిగా మారింది. యువత వీటి భారిన పడి..జివితాల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌కు అడ్డుకట్టవేసేందుకు..ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..సరఫరాను మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మాదక ద్రవ్యాల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. అసోం నుంచి రూ.100 కోట్ల విలువైన హెరాయిన్​ తరలిస్తుండగా చాకచక్యంగా ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వీరిని ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకీకి చెందిన మహ్మద్​ హషీమ్​, సబ్బీర్, నరేశ్​ కుమార్​గా గుర్తించారు.

Delhi Police recover heroin worth Rs 100 crore, రూ.100 కోట్ల హెరాయిన్..పక్కా స్కెచ్..బట్..!

మొదట 15 కిలోల మాదక ద్రవ్యాన్ని పట్టుకున్నారు. తర్వాత కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా మరో 10 కిలోలు దొరికింది. ఈ ముఠాకు అసోంలోని బోకాజన్​కు చెందిన వ్యక్తి సూత్రధారిగా తెలుస్తోంది. అతను మయన్మార్​ నుంచి వస్తున్న హెరాయిన్​ను ఇంపాల్​​కు చెందిన డీలర్​ వద్ద కొనుగోలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. రెండేళ్లలో ఈ ముఠా సుమారు 200 కిలోల హెరాయిన్​ను రాజధానికి తరలించింది. 2019లో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం 10 పర్యాయాలు మాదకద్రవ్యాల తరలింపును అడ్డుకొంది. ఈ తనిఖీల్లో సుమారు 600 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకుంది.

Related Tags