జింకను చంపి విందు: తెరవెనుక రాజకీయనేతలు..?

Deer Killed and Meat Cooked at Kondapuram in Yadadri District, జింకను చంపి విందు: తెరవెనుక రాజకీయనేతలు..?

యాదాద్రి జిల్లాలో జింకల వేట కలకలం రేపుతోంది. మోత్కూరు మండలం కొండాపురంలో జింకను చంపి తిన్నట్టు ఆధారాలు కనిపించాయి. స్థానిక ప్రాంతంలో జింక ఎముకలను గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ ప్రాంతంలో దొరికిన ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు ల్యాబ్‌కు పంపారు. గ్రామస్తులు చెబుతున్నదాని బట్టి అడవిలో జింకను వేటాడి విందు చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనలో కొంతమంది రాజకీయనేతల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *