ఉత్తరాఖండ్‌పై కన్నేసిన అరవింద్ కేజ్రీవాల్

ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలో ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఉత్తరాఖండ్‌పై కన్నేసిన అరవింద్ కేజ్రీవాల్
Follow us

|

Updated on: Aug 20, 2020 | 1:47 PM

ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలో ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో తమ పార్టీకి స్పష్టత లేదని.. ఈ నేపథ్యంలో ఇటీవల ఉత్తరాఖండ్‌లో సర్వే నిర్వహించగా 62 శాతం ప్రజలు తాము పోటీ చేయాలని భావిస్తున్నారని దీంతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలతోపాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగం, విద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు వంటి ప్రధాన సమస్యలు ఉత్తరాఖండ్‌లో ఉన్నట్లుగా తమ సర్వేలో గుర్తించినట్లు కేజ్రీవాల్ వివరించారు. ఈ సమస్యలపై దృష్టిసారించి ఉత్తరాఖండ్‌లో పట్టు కోసం ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మూడు సార్లు ఢిల్లీ సీఎం పదవిని చేపట్టిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జాతీయ పార్టీ గుర్తింపు కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్ పోటీ చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఢిల్లీతో మొదలైన ఆప్ ప్రస్తానం పంజాబ్ వరకు విస్తరించింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో 434 మంది ఆప్ అభ్యర్థులు పోటీ చేశారు. అనూహ్యంగా పంజాబ్‌లో 4 ఎంపీ సీట్లు గెలుపొందారు. దీంతో పంజాబ్‌లో రాష్ట్ర పార్టీగా ఆప్ గుర్తింపు పొందింది. 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ డిపాజిట్లు కోల్పోయింది. కాగా, అదే ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ ఇన్సాఫ్ పార్టీతో పొత్తుపెట్టుకుని 22 స్థానాల్లో గెలిచింది. ఇందులో ఆప్ 20 సీట్లలో విజయం సాధించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 2019 లో తక్కువ సంఖ్యలో అభ్యర్థులను రంగంలోకి దించింది. 9 రాష్ట్రాల నుంచి 40 మంది పోటీ చేయగా కేవలం పంజాబ్ లో మాత్రమే ఒక ఎంపీ సీటును మాత్రమే దక్కించుకుంది. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసింది. ఇక 2022లో జరుగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఆప్ పావులు కదుపుతోంది.