అదరగొట్టిన రాయుడు, జడేజా..ఢిల్లీ టార్గెట్ 180

అంబటి రాయుడు (45*; 25 బంతుల్లో, 1×4, 2×6), డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో; 6×4, 2×6) దుమ్ము లేపడంతో.. ఢిల్లీకి చెన్నై 180 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

అదరగొట్టిన రాయుడు, జడేజా..ఢిల్లీ టార్గెట్ 180
Follow us

|

Updated on: Oct 17, 2020 | 9:55 PM

అంబటి రాయుడు (45*; 25 బంతుల్లో, 1×4, 2×6), డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో; 6×4, 2×6) దుమ్ము లేపడంతో.. ఢిల్లీకి చెన్నై 180 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది. అయితే చెన్నై ఫస్ట్ ఓవర్‌‌లోనే వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు కూడా చేయకుండా సామ్‌కరన్‌ను దేశ్‌పాండే పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాట్సన్‌ (36; 28 బంతుల్లో, 6×4)తో కలిసి డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. తొలుత నెమ్మదిగా ఆడిన ఈ జోడీ.. తర్వాత దూకుడు పెంచడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో డుప్లెసిస్‌ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. కానీ, తర్వాతి బంతికే వాట్సన్‌ను నోర్జె క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో 87 పరుగుల భాగస్వామ్యానికి ఎండ్ కార్డ్ పడింది. కొద్దిసేపటికే డుప్లెసిస్‌ కూడా పెవిలియన్ చేరాడు.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ (3) మరోసారి విఫలమయ్యాడు. ఈ క్రమంలో రాయుడు భారీ షాట్‌లు ఆడుతూ  స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. జడేజా (33*, 13 బంతుల్లో, 4×6) కూడా సిక్సర్లతో అదరగొట్టాడు. 18వ ఓవర్‌ వేసిన దేశ్‌పాండే బౌలింగ్‌లో జడేజా బాదిన సిక్సర్‌ స్టేడియం అవతల పడింది. ఆఖరి అయిదు ఓవర్లలో చెన్నై 57 రన్స్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జె రెండు వికెట్లు దక్కగా, రబాడ, దేశ్‌పాండే చెరో వికెట్‌ తీశారు.