పొంచి వున్న తుఫాన్ల గండం.. డిసెంబర్ తొలి వారంలోనే ముప్పు.. ఏపీపైనా అధిక ప్రభావం

వర్షాలు వద్దురా బాబోయ్.. అనిపించేలా ఈ ఏడు వరుణుడు కరుణిస్తే.. వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా తుఫాన్ల కారణంగా భారీ వర్షాలు భారతావనిని ముంచెత్తుతున్నాయి. తాజాగా...

పొంచి వున్న తుఫాన్ల గండం.. డిసెంబర్ తొలి వారంలోనే ముప్పు.. ఏపీపైనా అధిక ప్రభావం
Follow us

|

Updated on: Nov 28, 2020 | 5:53 PM

Cyclones threat ahead for South-India: వర్షాలు వద్దురా బాబోయ్.. అనిపించేలా ఈ ఏడు వరుణుడు కరుణిస్తే.. వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా తుఫాన్ల కారణంగా భారీ వర్షాలు భారతావనిని ముంచెత్తుతున్నాయి. తాజాగా నివర్ తుఫాను దక్షిణాంధ్ర, రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఓ వైపు చలి.. ఇంకోవైపు వీడని ముసురు.. వెరసి జనం ముసుగు తన్ని పడునేలా చేశాయి. మరోవైపు చేతికొచ్చిన పంటను భారీ వర్షాలు నాశనం చేశాయి. అయితే.. తుఫాన్ల గండం ఇంకా వుందని చెబుతున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు.

నవంబర్ 29న అంటే ఆదివారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని వార్నింగిచ్చింది. డిసెంబర్‌ నెలలో మరో రెండు తుపాన్లు ఫామ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 2వ తేదీన ‘బురేవి తుపాను’ తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఆ తర్వాత డిసెంబర్ 5వ తూదీన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే మరో అల్పపీడనంతో ‘టకేటి తుపాను’ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంఛనా వేస్తోంది. దీని ప్రభావంతో డిసెంబరు 7న దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తీవ్రస్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వరుసగా మూడు తుఫాన్లతో దక్షిణ భారతంలోని పలు ప్రాంతాలు ముఖ్యంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వుందంటున్నారు.

ALSO READ: బీజేపీ నోట మధ్యంతరం మాట.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కమల నాథులు

ALSO READ: శ్రీవారి భక్తులకు శుభవార్త… టీటీడీ బోర్డు కీలక నిర్ణయం