సీరియల్ నటుడి పేరుతో యువతికి కుచ్చుటోపీ.. ఆటకట్టించిన పోలీసులు.. చివరకు ఏమైందంటే..

|

Feb 09, 2021 | 4:09 AM

సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ కొంతమంది కేటుగాళ్లు అమాయకపు ప్రజల దగ్గర డబ్బు దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీరియల్ నటుడు రవికృష్ణ పేరుతో ఓ యువతిని మోసం చేసాడు ఓ వ్యక్తి .

సీరియల్ నటుడి పేరుతో యువతికి కుచ్చుటోపీ.. ఆటకట్టించిన పోలీసులు.. చివరకు ఏమైందంటే..
Follow us on

సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ కొంతమంది కేటుగాళ్లు అమాయకపు ప్రజల దగ్గర డబ్బు దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీరియల్ నటుడు రవికృష్ణ పేరుతో ఓ యువతిని మోసం చేసాడు ఓ వ్యక్తి . ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన జంబాడ లక్మీ వరప్రసాద్‌.. సీరియల్‌ యాక్టర్‌ రవికృష్ణ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు. దుండిగల్‌కు చెందిన ఓ యువతిని ట్రాప్ చేసాడు. ఆమెతో కొద్దిరోజులు చాట్ చేసి ఆమె ఫోటోలను రప్పించుకున్నాడు. ఆతర్వాత వాటిని అడ్డుగాపెట్టుకొని ఆయువతిని బెదిరించి రూ.2.20 లక్షలు తీసుకున్నాడు. ఇంకా డబ్బుకావాలంటూ వేధించడంతో ఆమె సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించి. కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Robbery Failed : దొంగతనానికి విఫలయత్నం.. రాజోలులో పట్టపగలు సినిమా ఫక్కీలో చోరీ..!