రూ. 500కే కొత్త ఎల్ఈడీ టీవీ టీవీ.. ఆరా తీస్తే దిమ్మ తిరిగే షాక్‌.. పోలీసులే కంగుతిన్నారు

|

Mar 03, 2021 | 9:57 AM

ఎవరిదో సొమ్ము..మరెవరో దానం చేసినట్టుంది ఇక్కడి దొంగలపని. కృష్ణా జిల్లాలో విచిత్రమైన దొంగతనం బయటపడింది. 500కే టీవీ అమ్ముతుంటే పోలీసులకు అనుమానం వచ్చింది..

రూ. 500కే కొత్త ఎల్ఈడీ టీవీ టీవీ.. ఆరా తీస్తే దిమ్మ తిరిగే షాక్‌.. పోలీసులే కంగుతిన్నారు
Follow us on

ఎవరిదో సొమ్ము..మరెవరో దానం చేసినట్టుంది ఇక్కడి దొంగలపని. కృష్ణా జిల్లాలో విచిత్రమైన దొంగతనం బయటపడింది. 500కే టీవీ అమ్ముతుంటే పోలీసులకు అనుమానం వచ్చింది.. అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే దిమ్మ తిరిగే విషయాలు బయటపడ్డాయి.

జగ్గయ్యపేట మండలం గౌరవరం హైవేపై 500 రూపాయలకే కొత్త కలర్ టీవీని అమ్మేందుకు ప్రయత్నించారు కొందరు వ్యక్తులు. అంత తక్కువ ధరకు టీవీ విక్రయించేందుకు ప్రయత్నించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు టీవీ అమ్ముతున్న వారిని పట్టుకున్నారు. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, రూ. 500 కే ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించగా, అసలు విషయం బయటపెట్టారు కేటుగాళ్లు.

ఎనికేపాడులోని ఓ షోరూమ్‌ నుంచి భీమవరం వెళ్లేందుకు ఎలక్ట్రానిక్ వస్తువుల ఆటోను లోడ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కన్ను ఆ ఆటోపై పడింది.. లోడ్ చేసిన వస్తువుల్ని దొంగిలించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఎనికేపాడులో దొంగిలించి వాటిని ఆటోలో హైదరాబాద్‌ తీసుకుని వెళ్తున్నాడు. గౌరవరం దగ్గరకు రాగానే వస్తువులు తీసుకెళ్తున్న ఆటోలో డీజిల్‌ అయిపోవటంతో టీవీని 500లకు అమ్మి.. ఇందనం వరకు అమౌంట్ సరిపోతుందని భావించాడు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. బేరం ఆడగా 500 రూపాయలకు కూడా టీవీ ఇచ్చేస్తాననడంతో.. వ్యవహారంపై డౌట్ వచ్చి పోలీసులు రంగంలోకి దిగారు.

అప్పటికే షోరూం యజమాని ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు ఫాస్ట్‌ట్రాక్‌ ద్వారా వాహనాన్ని ట్రాక్‌ చేశారు. పట్టుబడిన వారి నుంచి 9 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దర్జాగా దొంగతనం చేసి.. హైదరాబాద్ వస్తువులు తీసుకెళ్తున్న వైనం చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఎక్కువగా యూపీ, బీహార్‌కకు చెందిన దొంగలే ఇలాంటి దొంగతనాలు చేస్తారని.. వారిని పట్టుకుని జైల్లో వేసినా మార్ప రావడం రాలేదని.. మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

Also Read:

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

Bumrah wedding: పెళ్లి కళ వచ్చేసింది..! అందుకే మ్యాచ్‌లకు దూరం.. పూర్తి వివరాలు ఇవే