Road Accident: విషాదం.. స్కూటీని ఢీకొట్టిన లారీ.. నటి కూతురు మృతి

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బెంగళూరులో ప్రముఖ టీవీ నటి అమృతా నాయుడు, ఆరు సంవత్సరాల..

Road Accident: విషాదం.. స్కూటీని ఢీకొట్టిన లారీ.. నటి కూతురు మృతి

Updated on: Jan 14, 2022 | 4:49 PM

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బెంగళూరులో ప్రముఖ టీవీ నటి అమృతా నాయుడు, ఆరు సంవత్సరాల కూతురుతో కలిసి స్కూటిపై వెళ్తుండగా, ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నటి కూతురు సమన్వి అక్కడికక్కడే మృతి చెందగా, నటి అమృతాకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గాయాలైన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే ఆమె నాలుగు నెలల గర్భవతి కూడా. ప్రస్తుతం నటి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన కూతురు సమన్వి పలు రియాల్టీ షోలలో మంచి పేరు తెచ్చుకుంది.

విషయం తెలుసుకున్న కన్నడ సినీ కళాకారులు విచారణం వ్యక్తం చేశారు. అమృతా నాయుడు చాలా మంచి వ్యక్తి అని, ఆమె ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుందని పలువురు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి:

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం.. తప్పిన పెను ప్రమాదం..

Indian Passport: పాస్‌పోర్టు ఉన్న భారతీయులకు గుడ్‌న్యూస్.. వీసా లేకున్నా, 59 దేశాలకు ప్రయాణం!

 

Follow Us