Scorpio Mystery: పదేపదే చక్కర్లు కొట్టిన వాహనం.. గుట్టు వీడుతున్న సిరివెళ్ల స్కార్పియో మిస్టరీ.. ఇంతకీ ఎందుకా ప్రయత్నం?

కర్నూలు జిల్లా సిరివెళ్ల స్కార్పియో మిస్టరీ వీడుతున్నట్లే కనిపిస్తోంది. ఆ గ్రామంలో పదేపదే చక్కర్లు కొట్టిన వాహనంలో కొందరు వ్యక్తులు.. భూమా అనుచరుడి హత్య కోసమే వచ్చారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Scorpio Mystery: పదేపదే చక్కర్లు కొట్టిన వాహనం.. గుట్టు వీడుతున్న సిరివెళ్ల స్కార్పియో మిస్టరీ.. ఇంతకీ ఎందుకా ప్రయత్నం?
Mysterious Scorpio In Kurnool District

Updated on: Jul 16, 2021 | 8:14 PM

Mysterious Scorpio in Kurnool District: కర్నూలు జిల్లా సిరివెళ్ల స్కార్పియో మిస్టరీ వీడుతున్నట్లే కనిపిస్తోంది. ఆ గ్రామంలో పదేపదే చక్కర్లు కొట్టిన వాహనంలో కొందరు వ్యక్తులు.. భూమా అనుచరుడి హత్య కోసమే వచ్చారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

మూడు రోజుల క్రితం ఓ స్కార్పియో మాజీ మంత్రి అఖిలప్రియ అనుచరుడు.. రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలోనూ రికార్డయ్యాయి. సిరివెళ్లలోని తన ఇంటి వైపు అనుమానాస్పదంగా స్కార్పియో వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు రవిచంద్రారెడ్డి. పదే పదే ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతూ దడ పుట్టించిందని పేర్కొన్నారు. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఒకే ఏరియాలో ముందుకూ వెనక్కి పదేపదే తిరిగిన స్కార్పియోను పోలీసులు కూడా చేజ్ చేశారు. హోరాహోరీ చేజింగ్ తర్వాత పొలాల్లో వెహికిల్‌ను వదిలేసిన అందులోని వ్యక్తులు పారిపోయారు.

రవిచంద్రారెడ్డి.. గతంలో ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నానికి స్కెచ్ వేసినట్లు కేసులున్నాయి. ఆయనపై రౌడీషీట్ కూడా ఓపెన్ అయ్యింది. అయితే.. ఆ కక్షతోనే రవిచంద్రారెడ్డిపై ఎటాక్‌కు AV సుబ్బారెడ్డి మనుషుల్ని పంపారని అఖిలప్రియ వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు గతంలో ప్లాన్ ఫెయిల్ అయ్యిందని, మళ్లీ హత్యాయత్నానికి డీల్‌ కుదుర్చుకోడానికే ఎవర్నో రవిచంద్ర పిలుపించుకున్నాడని ఆరోపిస్తున్నారు సుబ్బారెడ్డి.

అయితే, కర్నాటకకు చెందిన ఈ వెహికిల్‌లో వచ్చిన వ్యక్తులు కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్‌తో, ఓ మంత్రి పేరుతో వ్యవహారాన్ని తప్పుదారిపట్టించే ప్రయత్నంగానే పోలీసులు భావిస్తున్నారు.పైగా వీళ్లు వచ్చింది రవిచంద్రారెడ్డిని మర్డర్‌ చేయడానికే అన్నది కూడా పోలీసుల బలమైన అనుమానం. అసలా వ్యక్తులు ఎవరు.. పేర్లేంటి, మర్డర్‌ డీల్ ఏంటి? సుపారీ ఎంత ఈ వివరాలు రేపోమాపో తెలిపోయే చాన్స్ కనిపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us