వరంగల్‌లో దారుణం.. ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టిందని..

మొన్నటి వరకు లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో దేశ వ్యాప్తంగా క్రైం రేటు అదుపులోకి వచ్చిందనుకుంటే.. లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు రావడంతో మళ్లీ క్రైం రేటు పెరుగుతోంది.

వరంగల్‌లో దారుణం.. ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టిందని..
young man attacks woman

Edited By:

Updated on: Jun 17, 2020 | 7:16 PM

మొన్నటి వరకు లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో దేశ వ్యాప్తంగా క్రైం రేటు అదుపులోకి వచ్చిందనుకుంటే.. లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు రావడంతో మళ్లీ క్రైం రేటు పెరుగుతోంది. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలోని లేబర్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టిందన్న కోపంతో.. ఓ యువకుడు ఆ అమ్మాయిని బీర్ సీసాతో పొడిచి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోవడంతో.. స్థానిక ఏంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.