Donkeys Killed: అమానుషం.. గాడిదలు అరిచాయని కత్తితో విచక్షణారహితంగా దాడి.. అక్కడికక్కడే..

|

Jul 28, 2021 | 8:41 PM

Man Attacked Donkeys: సమాజంలోని కొందరు వ్యక్తులు.. క్షణికావేశంలో అందరూ అసహ్యించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. క్షణికావేశంలో కొందరు జంతువులు కంటే హీనంగా మారి అమానుషానికి

Donkeys Killed: అమానుషం.. గాడిదలు అరిచాయని కత్తితో విచక్షణారహితంగా దాడి.. అక్కడికక్కడే..
Follow us on

Man Attacked Donkeys: సమాజంలోని కొందరు వ్యక్తులు.. క్షణికావేశంలో అందరూ అసహ్యించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. క్షణికావేశంలో కొందరు జంతువులు కంటే హీనంగా మారి అమానుషానికి ఒడిగడుతున్నారు. సాటి మనుషులతోపాటు.. జంతువులపై కూడా క్రూరంగా దాడికి పాల్పడుతున్నారు. తాజాగా.. గాడిదలు అరిచాయనే కోపంతో ఓ వ్యక్తి దారుణంగా నరికి చంపాడు. ఈ దారుణ సంఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. వ్యక్తి దాడిలో రెండు గాడిదలు మృతిచెందగా.. మరో గాడిదకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు కుల్కచర్ల పోలీసులు వెల్లడించారు.

నారాయణపేట జిల్లాకు చెందిన గొర్రెల కాపర్లు కుల్కచర్లకు మెత కోసం వచ్చారు. వారి వెంట గాడిదలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో గాడిదలు అరిచాయనే కోపంతో కృష్ణ అనే వ్యక్తి కత్తితో గాడిదలపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ దాడిలో రెండు గాడిదలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో గాడిదకు తీవ్ర గాయాలయ్యాయని యజమాని లక్ష్మణ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు లక్ష్మణ్ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బుధవారం పిర్యాదు చేసినట్లు కుల్కచర్ల పోలీసులు వెల్లడించారు. నిందితితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Father Murder: కంటికి రెప్పలా పెంచిన కూతురే కడతేర్చింది.. ప్రేమ పెళ్లి వద్దన్నందుకు తండ్రిని రాడ్‌తో కొట్టి.. కిరాతకంగా

Vijayawada: ప్రేమ పేరుతో ట్రాప్.. ఏపీ నుంచి యూపీకి తీసుకెళ్లి అత్యాచారం.. ఆపై దారుణంగా..