Warangal crime: జైలుకెళ్లినా మారని తీరు.. మరోసారి ఆ పని చేస్తుండగా..

|

Feb 14, 2022 | 2:45 PM

జల్సాలకు బానిసై చోరీలను అలవాటుగా చేసుకున్నాడు. దొంగతనం కేసులో జైలుకూ వెళ్లొచ్చాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మరో సారి తాళం వేసి ఉన్న..

Warangal crime: జైలుకెళ్లినా మారని తీరు.. మరోసారి ఆ పని చేస్తుండగా..
Chori Warangal
Follow us on

జల్సాలకు బానిసై చోరీలను అలవాటుగా చేసుకున్నాడు. దొంగతనం కేసులో జైలుకూ వెళ్లొచ్చాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మరో సారి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీ చేసేవాడు. ఇలా దొంగిలించిన సొమ్మును వరంగల్ లో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ముందస్తు సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అతడిని, అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి బంగారు, వెండి నగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన తూర్పాటి ప్రసాద్‌.. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడటం, వచ్చిన ఆదాయం సరిపోకపోవడంతో చోరీలకు అలవాటు పడ్డాడు.

2012 నుంచి ఉమ్మడి వరంగల్‌(Warangal), ఖమ్మం(Khammam), నల్గొండ(Nalgonda) జిల్లాల్లో చోరీలకు పాల్పడుతూ జైలుకు సైతం వెళ్లొచ్చాడు. 2021 మార్చిలో జైలు నుంచి విడుదలైనా ప్రవర్తనలో మార్పు రాలేదు. వరంగల్‌తో పాటు రాచకొండ కమిషనరేట్‌ పరిధి యాదగిరిగుట్ట, సూర్యాపేట జిల్లాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసేవాడు. బంగారు, వెండి వస్తువులను అపహరించాడు. దొంగిలించిన సొమ్మును హైదరాబాద్‌కు చెందిన జ్యోతి, వడ్డె బాలాజీతో కలిసి వరంగల్‌ లో విక్రయించేవాడు. ఈ క్రమంలో చోరీ సొత్తు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ముగ్గురు నిందితులను, రూ.21లక్షలు విలువైన బంగారం, వెండి నగలు, రెండు కార్లు, తొమ్మిది చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

Also Read

Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. సుంకంలో కోత.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు..!

Govindananda Saraswati: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై గోవిందానంద సరస్వతి సంచలన ఆరోపణలు.. ఏమన్నారంటే?

CM Yogi Adityanath: ఆ ఇద్దరే కాంగ్రెస్‌ను ఖతం చేస్తారు.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచనల వ్యాఖ్యలు..