ఏంటి సామి ఇది.. ఏకంగా షాపు లోడునే అక్రమంగా తరలిస్తున్నారుగా..! అది కూడా కోళ్ల ఎరువు పేరుతో

అధికారులు ఎన్నికట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం రవాణా ఆగడం లేదు. తాజాగా పక్క రాష్ట్రం నుంచి చింతలపూడికి అక్రమంగా భారీ సంఖ్యలో..

ఏంటి సామి ఇది.. ఏకంగా షాపు లోడునే అక్రమంగా తరలిస్తున్నారుగా..! అది కూడా కోళ్ల ఎరువు పేరుతో

Updated on: Feb 13, 2021 | 6:05 PM

అధికారులు ఎన్నికట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం రవాణా ఆగడం లేదు. తాజాగా పక్క రాష్ట్రం నుంచి చింతలపూడికి అక్రమంగా భారీ సంఖ్యలో తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేయగా.. ట్రాక్టర్​లో కోళ్ల ఎరువులు మధ్య భారీగా తరలిస్తున్న 1100 తెలంగాణ మద్యం బాటిల్స్ ఉన్నట్లు గుర్తించారు. మద్యం తరలించే విధానాన్ని చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. ట్రాలీలో మద్యం తరలిస్తుండగా చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి ట్రాక్టర్​పై కోళ్ల ఎరువును చింతలపూడికి తరలించాలని.. ఆ లోడును గంగారం అడ్డరోడ్డు వద్ద అన్​లోడ్ చేసి తనకు అప్పగించాలని చెప్పినట్లు డ్రైవర్  చెప్పుకొచ్చాడు. అందులో మద్యం ఉన్నట్లు తనకు తెలియదని చెప్పడంతో.. అసలు వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుకున్న మద్యం సీసాల విలువ సుమారు 12 లక్షల విలువ ఉంటుందని చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు వెల్లడించారు.

Also Read:

Vitamin D in rice: తెలంగాణ రైతు అద్భుత సృష్టి.. ‘డి’ విటమిన్ బియ్యంతో దేశవ్యాప్తంగా ఖ్యాతి

అనుచరుడికి జీహెచ్ఎంసీ జరిమానాపై స్పందించిన మేయర్ విజయలక్ష్మి.. ఏమన్నారంటే…?

Loading...
Unable to load recommendations.
Follow Us