Crime News: హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై ఆటో డ్రైవ‌ర్ లైంగిక దాడి.. ఆ తర్వాత..

|

Oct 21, 2021 | 8:22 PM

Girl raped by auto driver: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ 17ఏళ్ల బాలిక‌పై ఆటోడ్రైవ‌ర్ లైంగిక‌దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై

Crime News: హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై ఆటో డ్రైవ‌ర్ లైంగిక దాడి.. ఆ తర్వాత..
Crime News
Follow us on

Girl raped by auto driver: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ 17ఏళ్ల బాలిక‌పై ఆటోడ్రైవ‌ర్ లైంగిక‌దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై నగరంలోని బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో పరిధిలోని భీమ్ రాజ్‌(23) ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఈ క్రమంలో త‌న ఇంటికి స‌మీపంలోని బాలిక‌తో స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో ఆమె వెంట పడేవాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటాన‌ని ఆమెను శారీరకంగా లొంగ‌దీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇందిరాన‌గ‌ర్‌లోని త‌న ఫ్రెండ్ రూమ్‌కు భీమ్ రాజ్ ఆ బాలికన తీసుకోని వెళ్లారు. అనంతరం ఆమెపై లైంగిక‌దాడికి పాల్పడ్డాడు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే చంపేస్తాన‌ంటూ బాలికను బెదిరించాడు.

దీంతో ఆ బాలిక త‌ల్లిదండ్రుల‌కు చెప్పలేదు. అయితే.. ఇటీవల భీమ్ రాజ్ తరచూ బాలికను వేధిస్తున్నాడు. నిందితుడి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు ఈ విషయాన్ని త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు భీమ్‌ రాజ్‌పై కేసు న‌మోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు బంజరాహిల్స్‌ పోలీసులు వెల్లడించారు.

Also Read:

Viral Video: వ్యాక్సిన్‌ ఇస్తే పాముతో కరిపిస్తా.. మహిళ చేసిన పనితో భయంతో వైద్య సిబ్బంది పరుగులు.. వీడియో..

Crime News: ‘ప్రేమించి మోసం చేశాడు’.. మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ట్రైనీ ఐఏఎస్‌పై కేసు నమోదు..