Hyderabad: హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ కలకలం.. ఆటో ఎక్కిన యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..

Hyderabad: భాగ్యనగరంలో గ్యాంగ్ రేప్ పెను కలకలం సృష్టించింది. పట్టపగలే యువతిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్లు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Hyderabad: హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ కలకలం.. ఆటో ఎక్కిన యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..
Santhosh Nagar Ps

Updated on: Aug 18, 2021 | 8:29 PM

Hyderabad: భాగ్యనగరంలో గ్యాంగ్ రేప్ పెను కలకలం సృష్టించింది. పట్టపగలే యువతిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్లు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పహాడి షరీఫ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న యువతి(20).. సంతోష్ నగర్‌లో ఓ ఆటో ఎక్కింది. పహాడీ షరీఫ్ తీసుకువెళ్లిన తరువాత ఆటో డ్రైవర్ మరో యువకుడిని ఆటోలో ఎక్కించుకున్నాడు. అనంతరం ఆ యువకుడు యువతిని అరవకుండా నోరు మూయగా.. ఆటో డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై యువతిని వదిలేసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

కాగా, బాధిత యువతి నేరుగా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆటో డ్రైవర్ల అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సౌత్ జోన్ పోలీసులు.. విచారణ చేస్తున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించి.. వివరాలు సేకరిస్తున్నారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా విచారణ మొదలు పెట్టారు. యువతి ఆటో ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Also read:

Afghanistan Crisis: ఖజానాను దొంగిలించాడు.. అష్రఫ్‌ ఘనీని అరెస్ట్ చేయండి.. ఇంటర్‌పోల్‌కు ఆఫ్గన్ రాయబార కార్యాలయం ఫిర్యాదు..

Viral Video: కుక్కను వేటాడిన పిల్లులు.. భయంతో పరుగు లంకించుకున్న శునకం.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral News: ప్రేయసి కోసం ఈ దునియాలోనే ఎవరూ చేయని పని చేశాడు.. ఆఖరికి అడ్డంగా బుక్కయ్యాడు..

Loading...
Unable to load recommendations.
Follow Us