Hyderabad: బంజారాహిల్స్ లో అమానుషం.. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన తండ్రి..

|

Jan 15, 2022 | 12:36 PM

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తన సోదరుడికి ఈ విషయం చెప్పడంతో

Hyderabad: బంజారాహిల్స్ లో అమానుషం..  కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన తండ్రి..
Follow us on

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తన సోదరుడికి ఈ విషయం చెప్పడంతో తండ్రి వికృత బుద్ధి వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి. బంజారా హిల్స్ ప్రాంతంలో నివసించే ఆటోడ్రైవర్‌ భార్య ఇటీవల జబ్బు పడింది. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె సోదరుడు ఆమెను పరామర్శించడానికి ఇంటికొచ్చాడు. అప్పుడు తనతో పాటు తన పిల్లలను అతని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ భర్త మాత్రం పిల్లలను తన వద్దే ఉంచుకుంటానన్నాడు. నిందితుడి వికృత బుద్ధిని ఏ మాత్రం ఊహించని ఆ తల్లి తన 15 ఏళ్ల కుమార్తె, ఇద్దరు కుమారులను అతని దగ్గరే విడిచిపెట్టి వెళ్లింది.

కాగా ఈనెల 9న ఎప్పటిలాగే ఇంటికొచ్చిన తండ్రి అర్ధరాత్రి కూతురుపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమె నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడాడ్డు. బాధితురాలు జరిగిన విషయాన్ని మరుసటి రోజు తన సోదరుడికి చెప్పింది. ఆతర్వాత ఇద్దరూ కలిసి మహబూబ్ నగర్‌ లో ఉన్న తల్లి వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ విషయం విని విస్తుపోయిన తల్లి శుక్రవారం హైదరాబాద్‌ నగరానికి చేరుకుంది. భర్తపై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితునిపై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అతనిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:Ghani Movie: వరుణ్ తేజ్ గని నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మరోసారి అదరగొట్టిన మిల్కీబ్యూటీ..

National Army Day: దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలను మాటల్లో చెప్పలేం.. భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని..

Andhra Pradesh: పండగ వేళ విషాదం.. సెల్ఫీ మోజులో నదిలో పడిన యువతి.. కాపాడబోయి ప్రియుడు కూడా..