Family Suicide: బోయినపల్లిలో విషాదం.. పురుగుల మందుతాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం.. 

|

Jul 01, 2021 | 8:20 PM

Family Suicide Attempt: హైదరాబాద్ నగరంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మరణించగా..

Family Suicide: బోయినపల్లిలో విషాదం.. పురుగుల మందుతాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం.. 
Family Suicide
Follow us on

Family Suicide Attempt: హైదరాబాద్ నగరంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మరణించగా.. తండ్రి, ఇంకో కూతురు మృత్యువుతో పోరాడుతున్నారు. సికింద్రాబాద్‌లోని బోయినపల్లిలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. బోయినపల్లిలో నివసిస్తున్న దంపతులు ఇద్దరు కుమార్తెల‌తో స‌హా పురుగుల‌మందు తాగి గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లి, పెద్ద కుమార్తె మృతిచెంద‌గా.. తండ్రి భ‌రత్, చిన్న కుమార్తె ప‌రిస్థితి విష‌మంగా ఉందని పోలీసులు తెలిపారు.

మృతులు త‌ల్లి స్నేహ‌(40), కూతురు హ‌న్సిక‌(15) గా గుర్తించారు. మిగతా ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆర్థిక సమస్యలతోనే కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి పలు వివరాలను సేకరించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Suman MAA Elections: ‘భారత్‌లో పుట్టిన వారంతా లోకల్‌’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్‌.. మా ఎన్నికలను ఉద్దేశించేనా?

Errabelli Dayakar Rao: ‘పల్లె ప్రగతి’తోనే అభివృద్ధి.. రాజకీయాలకు అతీతంగా భాగస్వామ్యం కావాలి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు