కాంగ్రెస్‌ సర్పంచ్‌ హత్య.. పాక్ ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఏం..

జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సర్పంచ్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపేశారు. సోమవారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. అనంత్‌నాగ్‌ జిల్లాకు చెందిన అజయ్‌ పండిత అనే సర్పంచ్‌ను ఉగ్రవాదులు తుపాకీతో కాల్పులకు దిగి.. అక్కడి నుంచి పారిపోయారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని కోరారని మృతుడి బంధువులు తెలిపారు. […]

కాంగ్రెస్‌ సర్పంచ్‌ హత్య.. పాక్ ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఏం..
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 4:46 PM

జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సర్పంచ్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపేశారు. సోమవారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. అనంత్‌నాగ్‌ జిల్లాకు చెందిన అజయ్‌ పండిత అనే సర్పంచ్‌ను ఉగ్రవాదులు తుపాకీతో కాల్పులకు దిగి.. అక్కడి నుంచి పారిపోయారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని కోరారని మృతుడి బంధువులు తెలిపారు. స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టేవాడని.. ఈ క్రమంలో సోమవారం ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వాపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలావుంటే.. మంగళవారం ఉదయం లోక్భవన్‌ ప్రాంతంలో అజయ్ పండిత అంత్యక్రియలు పూర్తయ్యాయి.

కాగా, అజయ్‌ పండితను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే హతమార్చారంటూ.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దిష్టిబొమ్మను తగలబెట్టారు జమ్ముకశ్మీర్‌కు చెందిన బీజేవైఏం నేతలు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడిన నాయకుడిని చంపడం దుర్మార్గమని.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ ఘటనకు బాధ్యుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సారి పాక్‌పై సర్జికల్ స్ట్రైక్ జరపాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.