విషాదం: పబ్జీ పిచ్చికి 14 ఏళ్ల బాలుడు బలి..

కరోనా లాక్‌డౌన్ కాలంలో పిల్లలు మరింతగా సెల్‌ఫోన్లు, సెల్ ఫోన్లలో ఉండే గేమ్స్‌కి బాగా అలవాటు పడిపోతున్నారు. మొబైల్స్‌ లో గేమ్స్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

విషాదం: పబ్జీ పిచ్చికి 14 ఏళ్ల బాలుడు బలి..
Follow us

|

Updated on: Jul 13, 2020 | 1:03 PM

పిల్లలు సెల్‌ఫోన్లకు అలవాటు పడకుండా చూడాలని మానసిక నిపుణులు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. అయిన్నప్పటికీ కరోనా లాక్‌డౌన్ కాలంలో పిల్లలు మరింతగా సెల్‌ఫోన్లు, సెల్ ఫోన్లలో ఉండే గేమ్స్‌కి బాగా అలవాటు పడిపోతున్నారు. మొబైల్స్‌ లో గేమ్స్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో అటువంటిదే దారుణ సంఘటన చోటు చేసుకుంది. పబ్జీ గేమ్‌కు ఓ బాలుడు బలైపోయాడు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీనగర్ కాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పలమనేరు  శ్రీనగర్ కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలుడు టెన్త్ చదువుతున్నాడు. ఫోన్‌లో రోజూ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు..పబ్జీ గేమ్‌కు ఆ విద్యార్థి పూర్తిగా బానిసగా మారాడు. తండ్రి మొబైల్ తీసుకుని రోజంతా గేమ్‌లోనే మునిగి పోయేవాడు. ఈ క్రమంలో గేమ్ ఆడొద్దని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించే సరికి అతడు ఫ్యాన్‌కు వెళాడుతూ కనిపించాడు..వెంటనే అతన్ని కిందకు దింపి పలమనేరు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం తిరుపతికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బాలుడు చనిపోయినట్లుగా పలమనేరు పోలీసులు వెల్లడించారు.

Latest Articles
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..