రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన హాజీపూర్‌లో జరిగిన వరుస హత్యల కేసు విచారణ పూర్తైనట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. బుధవారం నల్గొండ పోక్సో కోర్టులో మూడు కేసుల్లో ఛార్జీ షీట్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించనుందని పేర్కొన్నారు. కేసు విచారణకు భువనగిరి ఏసీపీ భుజంగరావును నియమించారు. అయితే 90 రోజుల్లోనే విచారణ పూర్తి చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు.