Mother kills nine-year-old daughter: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నవ మాసాలు మోసి కని పెంచిన కన్న కూతురునే కడతేర్చింది ఓ కసాయి తల్లి. అక్కన్నపేట మండలం మల్చెరువు తండాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతురు భూక్య లావణ్య(9)ను తల్లి భూక్య రామీ రోకలిబండతో కొట్టి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లి రామికి మతిభ్రమించడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, గత కొంతకాలంగా ఆమె మానసికస్థితి సరిగాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also.. ఆటోలో ఫోర్న్ వీడియోలు చూస్తూ యువకుడి అసభ్య ప్రవర్తన.. చెప్పులతో కొట్టిన ఇద్దరు అమ్మాయిలు..