Hyderabad: బంజారాహిల్స్ లో దారుణం.. లిఫ్ట్ లో ఇరుక్కుని మహిళ మృతి..

హైదరాబాద్ బంజారాహిల్స్ లో  దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ లో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్ ఎన్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి ఓ ఇంట్లో

Hyderabad: బంజారాహిల్స్ లో దారుణం.. లిఫ్ట్ లో ఇరుక్కుని మహిళ మృతి..

Edited By:

Updated on: Jan 22, 2022 | 9:47 AM

హైదరాబాద్ బంజారాహిల్స్ లో  దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ లో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్ ఎన్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి ఓ ఇంట్లో పనిమనిషిగా పని చేస్తోన్న వీణ ప్రమాదవశాత్తూ లిఫ్ట్ లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించారు.  పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

బహుళ అంతస్తులు ఉండే అపార్ట్‌మెంట్స్, షాపింగ్‌ మాల్స్‌లో సౌకర్యవంతం కోసం లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాటి వినియోగంలో సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి . ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ నగరంలో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ లో ఇదే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ హోటల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తోన్న వ్యక్తి లిఫ్ట్ లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు.  అంతకుముందు ఓ చిన్నారి కూడా ఇదే విధంగా లిఫ్ట్ లో ఇరుక్కుపోయి మృతి చెందింది.

Also Read: IND VS SA: రెండో వన్డేలోనూ చతికిలపడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..

Twitter Video: ట్విట్ట‌ర్‌లో వ‌చ్చే వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియ‌ట్లేదా.? ఈ స్టెప్స్ ఫాలో అయితే స‌రి..

Telugu Man Married Turkey Woman: గుంటూరు అబ్బాయి , టర్కీ అమ్మాయి ఒక్కటైన వేళ..ఎట్రాక్ట్ చేస్తున్న వీడియో..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us